Harish Rao: గురుకుల విద్యార్థుల గోస కనిపించడం లేదా రేవంత్..!
ABN , Publish Date - Jul 31 , 2025 | 05:26 AM
పరిపాలనను గాలికి వదిలేసి నిత్యం రాజకీయాలుచేసే రేవంత్‌రెడ్డి, కాంగ్రె్‌సకు గురుకుల విద్యార్థుల గోస కనిపించకపోవడం

మీనాక్షి.. విద్యార్థుల పాదయాత్రపై దృష్టిపెట్టండి: హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): పరిపాలనను గాలికి వదిలేసి నిత్యం రాజకీయాలుచేసే రేవంత్‌రెడ్డి, కాంగ్రె్‌సకు గురుకుల విద్యార్థుల గోస కనిపించకపోవడం అమానవీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. స్థానిక ఎన్నికల రాజకీయం కాదు.. రాష్ట్రంలో దిగజారుతున్న గురుకుల వ్యవస్థను సీఎం కాపాడాలని బుధవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన డిమాండ్ చేశారు. ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే రేవంత్.. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న అలంపూర్ గురుకుల విద్యార్థులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. చదువుకునే పిల్లలు పట్టెడన్నం, తాగునీళ్ల కోసం పాదయాత్రలు చేసే దుస్థితి కల్పించారని, ఇది మీ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం మరోసారి పాదయాత్ర డ్రామాలు మొదలుపెడుతున్న కాంగ్రెస్.. గురుకుల విద్యార్థుల పాదయాత్రలపై ముందుగా దృష్టిసారించాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు సూచించారు. తరగతి గదుల్లో ఉండాల్సిన భావిభారత పౌరులను నడిరోడ్డు ఎక్కించిన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదని, ముందు దీనికి పరిష్కారం చూపాలని ఆమెను కోరారు. పోలీసుల ను పెట్టి, బలవంతంగా డీసీఎంలలో విద్యార్థులను తరలించిన నీచమైన చరిత్ర ఈ ఇందిరమ్మ రాజ్యానిదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా నుంచి పాదయాత్రగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు ఇవ్వాలనుకున్న విద్యార్థులకు తక్షణం పరిష్కారం చూపించాలన్నారు. రేవంత్ ఇప్పటికైనా కళు ్లతెరవాలని, రోజురోజుకీ పతనమవుతున్న గురుకుల వ్యవస్థను గాడిన పెట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News