Share News

Harish Rao: రాహుల్‌జీ ఇదేం రాజకీయం?

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:21 AM

ఇదేం రాజకీయం రాహుల్‌ గాంధీజీ.. ఎప్పుడో జరిగిన పాత విషయాన్ని గుర్తుంచుకొని కన్నీళ్లు కారుస్తున్నారు.. నిన్నటి పర్యావరణ విధ్వంసంపై స్పందించరా?’’ అంటూ మాజీమంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రశ్నించారు.

Harish Rao: రాహుల్‌జీ ఇదేం రాజకీయం?

  • హెచ్‌సీయూ విధ్వంసంపై స్పందించరా?: హరీశ్‌రావు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇదేం రాజకీయం రాహుల్‌ గాంధీజీ.. ఎప్పుడో జరిగిన పాత విషయాన్ని గుర్తుంచుకొని కన్నీళ్లు కారుస్తున్నారు.. నిన్నటి పర్యావరణ విధ్వంసంపై స్పందించరా?’’ అంటూ మాజీమంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రశ్నించారు. 2016లో జరిగిన రోహిత్‌ వేముల ఆత్మహత్య విషయాన్ని గుర్తుంచుకొన్నారు. ఇటీవల జరిగిన హెచ్‌సీయూ ఘటన మీకు గుర్తులేదా? అని సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన నిలదీశారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కుల వివక్ష ఘటనలపై రోహిత్‌ వేముల చట్టం తీసుకురావాలని మీ పార్టీ సీఎంలకు లేఖలు రాస్తున్నారు.


అదే సమయంలో మీ పార్టీ ప్రభుత్వాలు చేస్తున్న విధ్వంసకర చర్యలు, అక్రమాలపై కూడా మాట్లాడండి.. ఇప్పటికైనా మౌనం వీడండంటూ రాహుల్‌కు హరీశ్‌రావు సూచించారు. కాగా, తెలంగాణ రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు మహోత్సవ వేడుకలను జరపడం చూస్తుంటే.. చంపినోడే.. సంతాప సభ పెట్టినట్లుందని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారని పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యలు చేశారంటూ.. ఆ వ్యాఖ్యలు యావత్‌ తెలంగాణ సమాజాన్ని అవమాన పరచినట్లేనని దుయ్యబట్టారు. రాష్ట్ర రైతులను అవమానించిన మహేష్‌ గౌడ్‌ బేషరతుగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చేప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 22 , 2025 | 04:21 AM