Harish Rao: గ్రంథాలయాల్లో ఆంక్షలు.. దుర్మార్గం: హరీశ్
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:57 AM
గ్రంథాలయాల్లోనూ నిషేధాజ్ఞల బోర్డులు పెట్టి.. విద్యార్థులు, నిరుద్యోగ యువతపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ దుర్మార్గానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

హైదరాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : గ్రంథాలయాల్లోనూ నిషేధాజ్ఞల బోర్డులు పెట్టి.. విద్యార్థులు, నిరుద్యోగ యువతపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ దుర్మార్గానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం పగబట్టినట్టుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో ఇచ్చారని, ఇప్పుడు లైబ్రరీల్లో విద్యార్థులపై ఆంక్షలు పెట్టి ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో గ్రంథాలయాల చుట్టూ తిరిగి.. వాటిని రాజకీయ వేదికలుగా మార్చిన దుర్మార్గ చరిత్ర కాంగ్రె్‌సదేనన్నారు.
రాహుల్‌గాంధీని సైతం లైబ్రరీకి తీసుకొచ్చి, బూటకపు హామీలిచ్చిన సంగతి మరిచిపోయారా? అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే అవి రాజకీయ వేదికలు కావని గుర్తొచ్చిందా? అని గురువారం ‘ఎక్స్’ వేదికగా నిలదీశారు. విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే.. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీయడం తగదని అభిప్రాయపడ్డారు.