Share News

Hanumanth Rao: ఏబీఎన్‌కే దమ్కీ ఇచ్చే దమ్ముందా..?

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:20 AM

బీఆర్‌ఎస్‌ ఓ గూండా పార్టీలా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు.

Hanumanth Rao: ఏబీఎన్‌కే దమ్కీ ఇచ్చే దమ్ముందా..?

  • బీఆర్‌ఎ్‌సది అవకాశవాదం: మైనంపల్లి హన్మంతరావు

నిజాంపేట, జూలై 14 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఓ గూండా పార్టీలా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులకు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతికే దమ్కీ ఇచ్చే దమ్ముందా..? అని మండిపడ్డారు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలంలోని జడ్‌చెరువు తండాలో ప్రముఖ సంఘ సేవకుడు మోహన్‌ నాయక్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.


ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సభలో హన్మంతరావు మాట్లాడారు. అవకాశవాద రాజకీయాలు మానుకోవాలంటూ బీఆర్‌ఎ్‌సకు హితవు చెప్పారు. కాంగ్రెస్‌ జోలికొస్తే గుసాంచి కొడతామన్నారు. తమ పార్టీ కార్యకర్తలు ఎంతో ఓపికతో ఉన్నారని, హరీశ్‌రావు లాంటివారు సీఎంపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే దాడులు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Jul 15 , 2025 | 05:20 AM