Share News

Komatireddy: హ్యామ్‌ రోడ్లతో 50% రోడ్లకు మోక్షం!

ABN , Publish Date - Jul 10 , 2025 | 04:02 AM

మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు అనుసంధానం పెరగడంలో హ్యామ్‌ రోడ్లు కీలక పాత్రను పోషిస్తాయని, వాటితో రాష్ట్రంలో 50 శాతం రహదారులకు మోక్షం

Komatireddy: హ్యామ్‌ రోడ్లతో 50% రోడ్లకు మోక్షం!

  • సీఎం ఆమోదంతో టెండర్ల ప్రక్రియ: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు అనుసంధానం పెరగడంలో హ్యామ్‌ రోడ్లు కీలక పాత్రను పోషిస్తాయని, వాటితో రాష్ట్రంలో 50 శాతం రహదారులకు మోక్షం కలుగుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ క్లస్టర్లుగా రాష్ట్రాన్ని విభజించి రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదంతో టెండర్ల ప్రక్రియ వెంటనే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో బుధవారం సెక్రటేరియట్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ... జాతీయ రహదారుల నిర్మాణంలో పాటిస్తున్న నాణ్యత ప్రమాణాల ప్రకారమే రాష్ట్రంలో హ్యామ్‌ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. పదేళ్లపాటు చెక్కు చెదరకుండా ఉండేలా వీటి నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. జాతీయ రహదారి-65 పనుల పురోగతిని కోమటిరెడ్డి సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. రీజినల్‌ రింగురోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం ఆమోదం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేస్తామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.


ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 04:02 AM