Share News

Junior Colleges: ప్రభుత్వ కాలేజీల్లో నత్తనడకన ఇంటర్‌ అడ్మిషన్లు!

ABN , Publish Date - Jun 28 , 2025 | 03:48 AM

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రవేశాలు పెంచాలని ఇంటర్‌ బోర్డు అధికారులు ప్రిన్సిపాళ్లను పదేపదే కోరుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

Junior Colleges: ప్రభుత్వ కాలేజీల్లో నత్తనడకన ఇంటర్‌ అడ్మిషన్లు!

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రవేశాలు పెంచాలని ఇంటర్‌ బోర్డు అధికారులు ప్రిన్సిపాళ్లను పదేపదే కోరుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 12న ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 430 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉండగా.. 197 కాలేజీల్లో 100లోపు, 46 కాలేజీల్లో కేవలం 50లోపు అడ్మిషన్లు మాత్రమే నమోదయ్యాయి.


మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో మాత్రమే 1030 కొత్త అడ్మిషన్లు వచ్చాయి. ఆ తర్వాత 877 ప్రవేశాలతో నాంపల్లిలోని ఎంఎఎం మహిళా మోడల్‌ జూనియర్‌ కాలేజీ ద్వితీయ స్థానంలో నిలిచింది. 824 అడ్మిషన్లతో హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ తృతీయస్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 16 కాలేజీల్లో మాత్రమే 500కంటే ఎక్కువ అడ్మిషన్లు జరిగాయి.

Updated Date - Jun 28 , 2025 | 03:48 AM