Share News

Godavari waters: హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఆరోజున గోదావరి జలాలు బంద్‌

ABN , Publish Date - Feb 14 , 2025 | 10:58 AM

హైదరాబాద్‌: నగర దాహార్తి తీర్చడంలో కీలకమైన గోదావరి జలాల(Godavari waters) సరఫరా ఫిబ్రవరి 17న నిలిచిపోనున్నట్లు హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డు (HMWSSB) అధికారులు తెలిపారు. గోదావరి డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయ్‌ ఫేజ్‌-1లోని కొండపాక పంపింగ్‌ స్టేషన్‌(Kondapaka Pumping Station) వద్ద మరమ్మతుల కారణంగా నీటి సరఫరా ఆగిపోనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Godavari waters: హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఆరోజున గోదావరి జలాలు బంద్‌
GHMC Water Supply

హైదరాబాద్‌: నగర దాహార్తి తీర్చడంలో కీలకమైన గోదావరి జలాల (Godavari waters) సరఫరా ఫిబ్రవరి 17న నిలిచిపోనున్నట్లు హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డు (HMWSSB) అధికారులు తెలిపారు. గోదావరి డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయ్‌ ఫేజ్‌-1లోని కొండపాక పంపింగ్‌ స్టేషన్‌ (Kondapaka Pumping Station) వద్ద మరమ్మతుల కారణంగా నీటి సరఫరా ఆగిపోనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 17న ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకూ సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. కావున నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలంటూ వాటర్ సప్లై బోర్డ్ అధికారులు ఓ ప్రకటన జారీ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చంచల్‌గూడ జైలునుంచి పోలీస్‌ కస్టడీకి మస్తాన్‌సాయి..


నీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రాంతాలు ఇవే..

  • ఓ అండ్ ఎం డివిజన్-6: ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగల్‌రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్

  • ఓ అండ్ ఎం డివిజన్-9: కూకట్‌పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భరత్ నగర్, మోతీనగర్, గాయత్రీనగర్, బాబా నగర్, కేపీహెచ్‌బీ, బాలాజీ నగర్, హస్మత్ పేట్

  • ఓ అండ్ ఎం డివిజన్-12: చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజులరామరం, సూరారం, ఆదర్శ్ నగర్, భగత్ సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ

  • ఓ అండ్ ఎం డివిజన్-13: అల్వాల్, ఫాదర్ బాలయ్య నగర్, వెంకటాపురం, మాచ బొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్‌పేయి నగర్, యాప్రాల్, చాణక్యపురి, గౌతమ్ నగర్, సాయినాథపురం

  • ఓ అండ్ ఎం డివిజన్-14: చర్లపల్లి, సాయిబాబా నగర్, రాధిక

  • ఓ అండ్ ఎమ్ డివిజన్-15: కొండాపూర్, డోయన్స్, మాదాపూర్ (ఎంపిక చేసిన ప్రాంతాలలో)

  • ఓ అండ్ ఎం డివిజన్-17: హఫీజ్ పేట్, మియాపూర్

  • ఓ అండ్ ఎం డివిజన్-21: కోంపల్లి, గుండ్ల పోచంపల్లి, తూముకుంట, జవహర్ నగర్, దమ్మాయ్ గూడ, నాగారం

  • ఓ అండ్ ఎం డివిజన్-22: నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, గండి మైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం

  • ట్రాన్స్‌మిషన్ డివిజన్-4: ఎమ్ఈఎస్, త్రిశూల్ లైన్స్, గన్‌రాక్, హకీంపేట ఎయిర్‌ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బీబీ నగర్ ఎయిమ్స్

  • గ్రామీణ నీటి సరఫరా(RWS) ప్రాంతాలు: ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేరు (భువనగిరి), ఘన్‌పూర్ (మేడ్చల్/షామీర్‌పేట్)


పైన తెలిపిన ప్రాంతాల ప్రజలు ఫిబ్రవరి 17 కంటే ముందే తమతమ అవసరాలకు తగినట్లుగా నీటిని నిల్వ చేసుకోవాలని, అలాగే పొదుపుగా వాటిని వాడుకోవాలని హెచ్ఎమ్‌డబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Feb 14 , 2025 | 07:14 PM