కుంభమేళాలో తప్పిపోయిన అక్కాచెల్లెళ్లు క్షేమంగా ఇంటికి
ABN , Publish Date - Feb 02 , 2025 | 03:31 AM
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాల, కడెంకు చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు శనివారం క్షేమంగా ఇంటికి చేరారు.

జగిత్యాల, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాల, కడెంకు చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు శనివారం క్షేమంగా ఇంటికి చేరారు. వీర్ల నర్సవ్వ, ఆది రాజవ్వ, ఏనుగుల బుచ్చవ్వ, బెల్లపు సత్తవ్వ మరో ఎమిమిది మందితో కలిసి ప్రయాగ్‌రాజ్ వెళ్లారు. కుంభమేళాకు వెళ్లిన తర్వా త వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో స్థానికంగా ఉన్న ఆటోలను అద్దెకు తీసుకొని కుబేరా ఘాట్ వద్దకు స్నానానికి వెళ్లారు. తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్, ఇతర వస్తువులను ఆటో డ్రైవర్లకు ఇచ్చి వెళ్లారు.
అనంతరం దారి తప్పి రాత్రంతా అక్కడే జాగారం చేశారు. వారి వద్ద డబ్బులు, సెల్‌ఫోన్ లేకపోవడం, తెలుగు మినహా ఇతర భాష రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో కుంభమేళాలో ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన తెలుగు వారు తారసపడ్డారు. వారికి తమ గోడును వెళ్లబోసుకోవడంతో కొంత ఆర్థిక సాయం అందిం చారు. దీంతో రైల్వేస్టేషన్‌కు వచ్చిన అక్కాచెల్లెళ్లు వరంగల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో జగిత్యాలలోని తమ ఇళ్లకు చేరుకున్నారు.
ఇవీ చదవండి:
సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్
ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి