Share News

ACB: ఏసీబీ వలలో ఐదుగురు అధికారులు

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:26 AM

రాష్ట్రంలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో లంచం కోసం కక్కుర్తి పడ్డ ఐదుగురు అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. భద్రాది-కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్టమల్లారంలో కొందరు ప్రభుత్వభూమిని కబ్జాచేసి ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు.

ACB: ఏసీబీ వలలో ఐదుగురు అధికారులు

  • మణుగూర్‌లో భూవివాదం.. రూ.4 లక్షల డిమాండ్‌ చేసిన సీఐ అరెస్ట్‌

  • సీఐ తరఫున లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిగ్‌టీవీ విలేకరి గోపి

  • జనగామ, మేడ్చల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో మరో నలుగురు అధికారుల పట్టివేత

మణుగూర్‌ టౌన్‌/ చిలుపూర్‌/ ఆర్మూర్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో లంచం కోసం కక్కుర్తి పడ్డ ఐదుగురు అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. భద్రాది-కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్టమల్లారంలో కొందరు ప్రభుత్వభూమిని కబ్జాచేసి ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు. తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు మణుగూరు సీఐ సతీశ్‌ కుమార్‌ కేసు నమోదు చేశారు. ఇదే కేసులో మణుగూరు వాసి బేతంచర్ల వెంకటేశ్వరరావు, ఆయన మేనల్లుడు శ్రీనివా్‌సలకు పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించి.. కేసు పెట్టకుండా ఉండాలంటే రూ.4 లక్షలు లంచం అడిగారు. ఏసీబీ అధికారుల సూచన మేర కు సోమవారం సీఐకి మధ్యవర్తిగా వ్యవహరించిన బిగ్‌టీవీ విలేకరి గోపికి బాధితులు రూ.లక్ష నగదు అందజేశారు. అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు.. గోపిని, సీఐ సతీ్‌షకుమార్‌ను అరెస్ట్‌ చేశారు. కాగా, జనగామ జిల్లా చిలుపూర్‌కు చెందిన లింగయ్య, రాజయ్యలు మరణించిన తన తండ్రి పేరిట ఉన్న 1.23 ఎకరాల భూమిపై వారసత్వ పట్టా ఇవ్వాలని పలుమార్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) వినీత్‌కుమార్‌ను కోరారు.


ఆయన లంచం డిమాండ్‌ చేయ డంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం బాధితుల నుంచి రూ.26 వేల నగదు తీసుకుంటున్న ఆర్‌ఐ వినీత్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం డొంకేశ్వర్‌కు చెందిన కాంట్రాక్టర్‌కు సీసీరోడ్డు పనులకు రూ.4.70 లక్షల బిల్లులు క్లియర్‌ కావాల్సి ఉంది. వాటిని క్లియర్‌ చేయడానికి ఆర్మూర్‌ పంచాయతీరాజ్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసశర్మ రూ.7,500 లంచం డిమాండ్‌ చేశారు. దీంతో కాంట్రాక్టర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం కాంట్రాక్టర్‌ నుంచి రూ.7వేలు తీసుకుంటున్న శ్రీనివాస శర్మను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. అలాగే, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో కాంట్రాక్టర్‌కు రోడ్డు నిర్మాణానికి గాను జీఎస్టీ మినహా రూ.8.50 లక్షలు చెల్లించాలి. ఆ బిల్లు మంజూరుకు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను మున్సిపల్‌ డీఈఈ రఘు డిమాండ్‌చేశారు. దీంతో కాంట్రాక్టర్‌.. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం డీఈఈ సూచన మేరకు వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌కు కాంట్రాక్టర్‌ రూ.లక్ష నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డీఈఈ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌లపై కేసులు నమోదు చేశారు.

Updated Date - Apr 22 , 2025 | 04:26 AM