Khammam: వనజీవికి కన్నీటి వీడ్కోలు
ABN , Publish Date - Apr 14 , 2025 | 04:28 AM
పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్యకు కుటుంబసభ్యులు, అభిమానుల సమక్షంలో ఆదివారం తుది వీడ్కోలు పలికారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో వనజీవి రామయ్య మృతిచెందిన విషయం తెలిసిందే.

స్వగ్రామంలో రామయ్య అంత్యక్రియలు పూర్తి
అంతిమయాత్రకు తరలివచ్చిన అభిమానులు
నివాళులర్పించిన మంత్రి పొంగులేటి
పాడె మోసిన రూరల్ తహసీల్దార్, కమిషనర్
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్యకు కుటుంబసభ్యులు, అభిమానుల సమక్షంలో ఆదివారం తుది వీడ్కోలు పలికారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో వనజీవి రామయ్య మృతిచెందిన విషయం తెలిసిందే. అయన అంత్యక్రియలను ఆదివారం రామయ్య స్వగ్రామం రెడ్డిపల్లిలో నిర్వహించారు. ఖమ్మం రూరల్ తహసీల్దార్ పిల్లి రాంప్రసాద్, ఏదులాపురం మునిసిపల్ కమిషనర్ శ్రీనివా్‌సరెడ్డి అంతిమయాత్రలో పాల్గొని రామయ్య పాడె మోశారు. ఖమ్మం జిల్లా ఫారెస్టుశాఖ డీఎ్‌ఫవో సిద్దార్ధ విక్రమ్‌సింగ్, ఎఫ్‌డీవో మంజుల, ఎఫ్‌ఆర్‌వో శ్రీనివా్‌సరెడ్డి అధికారులు, సిబ్బంది సుమారు 50మంది రామయ్య అంతిమయాత్రలో పాల్గొన్నారు.
అంతకు ముందు రామయ్య భౌతికకాయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి, ఖమ్మం సీపీ సునీల్‌దత్ సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంత్రి పొం గులేటి మాట్లాడుతూ వనజీవి రామయ్య మృతి చాలా బాధాకరమన్నారు. మొక్కలు పెంచడం వల్ల ప్రకృతికి, సమాజానికి కలిగే ప్రయోజనాలను రామ య్య ప్రజలకు వివరిస్తూ అనేక ప్రాంతాల్లో మొక్క లు నాటారని కొనియాడారు. కాగా, వనజీవి రామయ్య ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని, ఇందులో భాగంగా నేటి నుంచి ప్రతిరోజూ తాను కూడా ఒక మొక్క నాటి సం రక్షిస్తానని ఏపీలోని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మొక్క నాటి రామయ్యకు నివాళులర్పించారు.