Farmers Protest: పొలాలు ఎండుతున్నాయ్.. నీరివ్వండి
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:43 AM
ఎస్సారెస్పీ కాల్వ ద్వారా గోదావరి జలాలు రాకపోవడంతో తమ పొలాలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సూర్యాపేట జిల్లాలో 200 మంది రైతుల రాస్తారోకో
ఆత్మకూర్(ఎస్), జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఎస్సారెస్పీ కాల్వ ద్వారా గోదావరి జలాలు రాకపోవడంతో తమ పొలాలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారబందీ ప్రకారం ఎండుతున్న పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని నసీంపేట, తిప్పాలగూడెం, రామోజీతండా, శెట్టిగూడెం గ్రామాలకు చెందిన సుమారు 200 మంది రైతులు చివ్వెంల-ముకుందాపురం ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా గోదావరి జలాలతో పంటలు పండించుకుంటున్నామని, ఈ యాసంగి సీజన్‌లో పొలాలు నాటు పెట్టామన్నారు. నాట్లు వేయకముందు వారబందీ చొప్పున నీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం నీళ్లు నిలిపివేయడంతో పొలాలు ఎండిపోతున్నాయన్నారు. తక్షణమే గోదావరిజలాలు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. లేనిపక్షంలో ఎద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.