Share News

MA Faheem: హైడ్రా పేరుతో వసూళ్లు

ABN , Publish Date - Apr 17 , 2025 | 03:55 AM

హైడ్రా పేరుతో తాను వసూళ్లకు పాల్పడుతున్నట్లు అమీన్‌పూర్‌ సంక్షేమ సంఘం పేరుతో ఒక నకిలీ లేఖ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోందని, దీని వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎంఏ.ఫహీమ్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

MA Faheem: హైడ్రా పేరుతో వసూళ్లు

  • సోషల్‌ మీడియాలో వైరలవుతున్న నకిలీ లేఖ

  • సైబర్‌ క్రైమ్‌కు ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఫహీమ్‌ ఫిర్యాదు

హైదరాబాద్‌, అమీన్‌పూర్‌ ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): హైడ్రా పేరుతో తాను వసూళ్లకు పాల్పడుతున్నట్లు అమీన్‌పూర్‌ సంక్షేమ సంఘం పేరుతో ఒక నకిలీ లేఖ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోందని, దీని వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎంఏ.ఫహీమ్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేసినట్లు.. ఇవ్వని పక్షంలో సీఎం సాయంతో హైడ్రా అధికారులను పంపించి ఇళ్లు కూల్చి వేస్తానంటూ బెదిరించినట్లుగా ఆ లేఖలో ప్రస్తావించారని సైబర్‌క్రైమ్‌ దృష్టికి తెచ్చారు.


ఆ లేఖ నకిలీ లేఖ అని ఇప్పటికే పోలీసులు తేల్చారన్నారు. రాజకీయంగా కక్ష సాధింపులో భాగంగానే ఆ లేఖను సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారని, దీని వెనుక బీఆర్‌ఎస్‌ పార్టీ హస్తం ఉందని ఆయన అన్నారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన పోలీసులను కోరారు.

Updated Date - Apr 17 , 2025 | 03:55 AM