Excise Department: కల్లు దుకాణాలపై దాడులు..
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:08 AM
హైదరాబాద్ కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని కల్లు కంపౌండ్లు, దుకాణాలపై దాడులు నిర్వహించాలని ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది.

రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ ప్రత్యేక బృందాలు
హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని కల్లు కంపౌండ్లు, దుకాణాలపై దాడులు నిర్వహించాలని ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా వారం రోజులపాటు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈమేరకు ఆయా బృందాలకు సోమవారమే ఆదేశాలు జారీ కాగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కూకట్‌పల్లి కల్తీ కల్లు వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిం. కల్తీ కల్లు తాగి పదకొండు మంది మృత్యువాత పడిన నేపథ్యంలో ఆబ్కారీ శాఖ కల్లు నమూనాలు సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షిస్తే అన్నిట్లోనూ ప్రాణాంతకమైన అల్ర్పాజోలం ఉన్నట్లు తేలినా ఆ శాఖ అధికారులు మేల్కొనకపోవడంపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ఉన్నతస్థాయి అధికారుల్లోనూ చర్చసాగింది. ఈ నేపథ్యంలో కల్లు విక్రయాలను 2004లో ఎందుకు నిలిపివేశారు.. 2014లో మళ్లీ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందనే దానిపైప్రభుత్వం ఆరా తీసింది. రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించాలని ఎక్సైజ్‌శాఖ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలమేరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీ.. కల్లు కంపౌండ్‌లపై స్టేట్ టాస్క్ ఫోర్స్, అసిస్టెంట్ కమిషనర్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డిస్ర్టిక్ టాస్క్‌ఫోర్స్ బృందాలు దాడులు చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది కూడా కల్లు దుకాణాలపై నిఘా పెట్టాలని, కల్తీ కల్లును గుర్తిస్తే కేసులు నమోదు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కల్లు కంపౌండ్‌లు, కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్ని సొసైటీలున్నాయి.. వాటి పరిధిలోని కల్లు దుకాణాలు ఎన్ని.. వాటిలో విక్రయిస్తున్న కల్లు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారో పరిశీలించనున్నారు. కల్లు శాంపిళ్లను ేసకరించి ల్యాబ్‌కు పంపేలా చర్యలు తీసుకోనున్నారు. అనుమతులు లేని కల్లు దుకాణాలను సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తారు. కల్లు అక్రమ రవాణా, కల్తీ కల్లు తయారు చేసేవారిపై కఠినంగా వ్యవహరించనున్నారు. లైసెన్స్‌లు లేని కల్లు దుకాణాలను సీజ్ చేయనున్నారు. కల్లు దందాల్లో సిండికేట్ వ్యవస్థనూ గుర్తించనున్నారు. కాగా కల్తీ కల్లు వ్యవహారంపై ఎక్సైజ్ కమిషనర్‌ను సీఎంవో పిలిపించి.. గతంలో ఈ సమస్యపై ఆశాఖ నుంచి తీసుకున్న నిర్ణయాలు, కల్తీ కల్లు నియంత్రణకు చేపట్టిన చర్యల గురించి వివరాలు సేకరించినట్లు తెలిసింది. 2004లో కల్తీ కల్లు వ్యవహారంపై అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఎక్సైజ్ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి హైదరాబాద్‌లో కల్లు విక్రయాలులేకుండా చర్యలు తీసుకున్నారనే అంశం అధికారుల్లో చర్చకు వచ్చినట్లు తెలిసింది. 2004లో హైదరాబాద్‌లో కల్లు విక్రయాలను నిలువరించిన ప్రభుత్వం.. 2014లో ఏ కారణంతో మళ్లీ కల్లు విక్రయాలకు అనుమతిచ్చిందని కమిషనర్ అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. కూకట్‌పల్లి కల్తీ ఘటనతో కల్లు అమ్మకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం అఽధ్యయనం చేస్తోంది.
కఠినంగా వ్యవహరిస్తాం..
కల్లు అమ్మకాల్లో కల్తీ చేసినా, అల్ర్పాజోలం, డైజోఫాం వంటి నిషేదిత పదార్థాలతో కల్లు తయారు చేసి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠినంగా వ్యవహరిస్తాం. ఎప్పటికీ లైసెన్స్‌లు లేకుండా చేస్తాం. సొసైటీ సభ్యత్వం నుంచి సైతం తొలగించేలా చర్యలు తీసుకుంటాం.
-ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం
కల్తీ కల్లు బాధితురాలిమృతి
11కు చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్ సిటీ/నిమ్స్/అడ్డగుట్ట/జీడిమెట్ల/హైదర్‌నగర్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కూకట్‌పల్లి కల్తీకల్లు ఘటనలో సోమవారం మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. హైదర్‌నగర్‌లోని రాంనరే్‌షనగర్‌కు చెందిన పుట్టి గంగామణి (40) గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. కాగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 16 మంది కల్తీ కల్లు బాధితుల్లో గంగామణి మృతి చెందినట్లు సూపరింటెండెంట్ రాజకుమారి తెలిపారు. ముగ్గురు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారని, మరో నలుగురినిసోమవారం డిశ్చార్జ్ చేసినట్టు చెప్పారు. మిగతా 8 మందికి ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.
కల్తీ కల్లు తాగి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిలో సోమవారం ఐదుగురు డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు ఆదివారం కుత్బుల్లాపూర్‌లోని రామిరెడ్డినగర్‌లో కల్లు తాగిన భార్యాభర్తలు లచ్చిరాం, సాక్రిభాయ్ తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. వారిని కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారికి ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్తీకల్లు ఘటనతో ఎక్సైజ్, పోలీస్ అధికారులు కొన్ని కల్లు దుకాణాల్లో సోమవారం సోదాలు నిర్వహించారు. మేడ్చల్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె.మాధవయ్య, జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.నర్సిరెడ్డి... రామిరెడ్డినగర్‌లోని కేకే ఓనర్స్ సొసైటీలో ఉన్న కల్లు షాపును పరిశీలించారు.
ఇవి కూడా చదవండి
నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '
తిరుపతి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి