Share News

ర్యాంప్‌పై తూలి పడబోయిన ఆర్మేనియా భామ

ABN , Publish Date - Jun 01 , 2025 | 03:18 AM

మిస్‌ వరల్డ్‌ 2025 గ్రాండ్‌ ఫినాలేలో భాగంగా నిర్వహించిన ‘ఈవినింగ్‌ గౌన్‌’ రౌండ్‌ అందాల భామలకు పరీక్ష పెట్టింది. వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులను పరిచయం చేస్తూ సాగిన ఈ రౌండ్‌లో పోటీదారులు భారీ డిజైనర్‌ గౌన్లు ధరించిర్యాంప్‌ వాక్‌ చేశారు.

ర్యాంప్‌పై తూలి పడబోయిన ఆర్మేనియా భామ

  • ఈవినింగ్‌ గౌన్‌ రౌండ్‌లో సుందరీమణుల పాట్లు

హైదరాబాద్‌ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): మిస్‌ వరల్డ్‌ 2025 గ్రాండ్‌ ఫినాలేలో భాగంగా నిర్వహించిన ‘ఈవినింగ్‌ గౌన్‌’ రౌండ్‌ అందాల భామలకు పరీక్ష పెట్టింది. వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులను పరిచయం చేస్తూ సాగిన ఈ రౌండ్‌లో పోటీదారులు భారీ డిజైనర్‌ గౌన్లు ధరించిర్యాంప్‌ వాక్‌ చేశారు. ఈ క్రమంలో వారంతా అవస్థలు పడ్డారు. ర్యాంప్‌పై నడిచేందుకు మిస్‌ వరల్డ్‌ స్కాట్లాండ్‌ తీవ్రంగా ఇబ్బంది పడితే, మిస్‌ వరల్డ్‌ ఆర్మేనియా ఏకంగా ర్యాంప్‌పై తూలి పడిపోబోయారు. తాము ధరించిన గౌన్లు కాళ్లకు అడ్డం పడుతుంటే కాంబోడియా, చైనా తదితర దేశాల వనితలు కూడా ర్యాంప్‌ వాక్‌కు కష్టపడ్డారు. ఇక, ఈ రౌండ్‌లో మిస్‌ వరల్డ్‌ ఇండియా నందినీ గుప్తా ర్యాంప్‌ మీదికి రాగానే ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. పిలిప్పైన్స్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక పోటీదారులకు కూడా ప్రేక్షకుల నుంచి స్పందన లభించింది.


మిస్‌ వరల్డ్‌ వేదికపై మెరిసిన తెలంగాణా చేనేత

వేదికపై తెలంగాణ చేనేత వైభవం మెరిసింది. నేషనల్‌ కాస్ట్యూమ్‌ రౌండ్‌లో భాగంగా ఆతిథ్య దేశం, రాష్ట్రం సంప్రదాయ వస్త్రధారణను ప్రపంచానికి చాటి చెప్పేలా పోటీదారులు వస్త్రాలు ధరించారు. భారతీయ సంప్రదాయ ప్రకా రం అభివందనం చేస్తూ ర్యాంప్‌ వాక్‌ చేశారు. పోటీదారుల్లో ఎక్కువ మంది లంగా, వోణిలలో మెరిసిపోయారు. ప్రముఖ డిజైనర్‌ అర్చనా కొచ్చర్‌ రూపొందించిన వస్త్రాలు, డిజైన్లు పోటీదారులకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. తెలంగాణ ఇక్కత్‌తోపాటు తెలంగాణ సంప్రదాయ వస్త్రాలతో ఈ డిజైన్లు రూపొందించానని, అసలైన బంగారు జరీతో వస్త్రాలను తీర్చిదిద్దానని అర్చనా కొచ్చర్‌ తెలిపారు.


‘బ్యూటీ విత్‌ పర్పస్‌’ విజేత ఇండోనేషియా భామ

మిస్‌ వరల్డ్‌ ఇండోనేషియా మోనికా కీజియా సెమ్బిరింగ్‌.. పోటీలో భాగంగా బ్యూటీ విత్‌ పర్పస్‌ అవార్డు విజేతగా నిలిచారు. ‘పైప్‌లైన్‌ ఫర్‌ లైఫ్‌లైన్‌’ పేరిట చేపట్టిన ప్రాజెక్టు ఆమెకు అవార్డు తెచ్చిపెట్టింది. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివి ఓ బ్యాంకులో పని చేస్తోన్న మోనికా.. పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణిగా కూడా సేవలందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 03:18 AM