Share News

ప్రధాని మోదీని కలిసిన ఎంపీ ఈటల

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:01 AM

ప్రధాని నరేంద్ర మోదీని మల్కాజిగిరి పార్లమెంట్‌ సభ్యుడు ఈటల రాజేందర్‌ తన కుటుంబసభ్యులతో సహా వెళ్లి కలిశారు.

ప్రధాని మోదీని కలిసిన ఎంపీ ఈటల

న్యూఢిల్లీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీని మల్కాజిగిరి పార్లమెంట్‌ సభ్యుడు ఈటల రాజేందర్‌ తన కుటుంబసభ్యులతో సహా వెళ్లి కలిశారు. పార్లమెంటులో సోమవారం ప్రధానిని కలిసి కొంతసేపు ముచ్చటించారు. కుటుంబసభ్యులను ఆయనకు పరిచయం చేశారు. ప్రధానిని కలిసిన వారిలో రాజేందర్‌ సతీమణి జమున, కుమారుడు నితిన్‌, కుమార్తె నీత, అల్లుడు అనూప్‌, మేనల్లుడు రాహుల్‌, మనవళ్లు రుషాంగ్‌, హృద్యాంష్‌ ఉన్నారు. ఆ తర్వాత ఈటల కుటుంబసభ్యులతోపాటు స్పీకర్‌ ఓం బిర్లాను కలిశారు.

Updated Date - Mar 11 , 2025 | 04:01 AM