Share News

Mahesh Babu: హీరో మహేశ్‌ బాబుకు ఈడీ నోటీసు

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:00 AM

టాలీవుడ్‌ హీరో మహే్‌షబాబును ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని సురానా డెవలపర్స్‌, సాయిసూర్య డెవలపర్స్‌ సంస్ధల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Mahesh Babu: హీరో మహేశ్‌ బాబుకు ఈడీ నోటీసు

  • 27న విచారణకు రావాలని పిలుపు

  • స్థిరాస్తి అక్రమాల ఆరోపణలున్న సురానా డెవలపర్స్‌ సంస్థకు మహేశ్‌ ప్రచారం

  • పారితోషికంగా రూ.5.9 కోట్లు.. దాంట్లో రూ.2.5 కోట్లు నగదుగా చెల్లింపు

  • ఇటీవలే సురానా ఆఫీసుల్లో ఈడీ సోదాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): టాలీవుడ్‌ హీరో మహే్‌షబాబును ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని సురానా డెవలపర్స్‌, సాయిసూర్య డెవలపర్స్‌ సంస్ధల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ రెండు సంస్ధలు రియల్‌ ఎస్టేట్‌ అక్రమాలకు పాల్పడ్డాయని, ఒకే ప్లాట్‌ పది మందికి అమ్మారని, వంద కోట్ల రూపాయలు పైగా నగదు రూపంలో డబ్బు తీసుకున్నారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కంపెనీలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో మహే్‌షబాబు నటించారు. అందుకు గాను సదరు కంపెనీ నుంచి మహే్‌షబాబు రూ.5.9 కోట్ల పారితోషికం తీసుకున్నారు.


ఇందులో చెక్‌ రూపేణా మూడు కోట్ల 40 లక్షల రూపాయలు తీసుకోగా, నగదు రూపంలో రెండున్నర కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ పారితోషికానికి సంబంధించి విచారణ నిమిత్తం మహే్‌షబాబును ఈడీ అధికారులు పిలిచారు. మహే్‌షబాబు చేసిన ప్రకటనలు చూసి చాలా మంది ఈ సంస్ధల్లో ప్లాట్లు బుక్‌ చేసుకున్నారని, తర్వాత సంస్ధ వ్యవహర శైలిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం. పలువురు బాధితుల నుంచి దాదాపు వంద కోట్ల రూపాయలను సురానా, సాయిసూర్య డెవలపర్స్‌ నగదు అడ్వాన్స్‌ రూపంలో తీసుకుని, వారిని మోసం చేశారన్న ఆరోపణల కేసులో హైదరాబాద్‌ పోలీసులతో పాటు, ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే

CM Revanth Praised Women: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 23 , 2025 | 04:00 AM