Dr RS Paroda: చైనాకు దీటుగా వరి దిగుబడి పెరగాలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:24 AM
భారత వరి దిగుబడిని చైనాతో సమానంగా పెంచడానికి, సాగు పద్ధతులు, వంగడాలపై పరిశోధన జరిపేలా డాక్టర్ ఆర్.ఎస్ పరోడా సూచించారు. ఐఐఆర్‌ఆర్‌లో 500 మంది వరి పరిశోధకులు గోల్డెన్ జూబ్లీ సమావేశంలో పాల్గొన్నారు

సీఏఆర్ మాజీ డీజీ డాక్టర్ ఆర్‌ఎస్ పరోడా
ఐఐఆర్‌ఆర్‌లో వరి పరిశోధకుల సమావేశాలు షురూ
రాజేంద్రనగర్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): చైనాలో వరి సగటు దిగుబడి హెక్టారుకు 6 టన్నులు కాగా, భారత్‌లో హైకార్టుకు 3.5 టన్నుల దిగుబడి మాత్రమే ఉందని, ఈ గ్యాప్‌ను మేలైన వంగడాలు, సాగు నిర్వహణ పద్ధతుల ద్వారా భర్తీ చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) పూర్వ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్రసింగ్ పరోడా అన్నారు. ఐసీఏఆర్ భాగస్వామ్యంతో రాజేంద్రనగర్‌లోని భారత వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్‌ఆర్)లో మూడు రోజుల పాటు జరుగనున్న వరి పరిశోధకుల గోల్డెన్ జూబ్లీ బృంద సమావేశాలను ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగిలాల్ జాట్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల నుంచి 500 మంది వరి పరిశోధకులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రాజేంద్రసింగ్ పరోడా మాట్లాడుతూ.. పంజాబ్ రైతులు హైబ్రీడ్ వరి సాగును నిలిపివేశారని, అందుకు గల కారణాలను అన్వేషించి వాటి పరిష్కారానికి మార్గాలు చూపి అక్కడ హైబ్రీడ్ వరి సాగును పెంచే దిశగా కార్యచరణతో ముందుకు సాగాలన్నారు.
డాక్టర్ మంగిలాల్ జాట్ మాట్లాడుతూ.. ప్రాంతాల వారీగా భారత్‌లోని వ్యవసాయ, ఆహార వ్యవస్థలపై దృష్టి కేంద్రీకరించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. నత్రజని, ఫాస్పరస్, నీటి వినియోగ సామర్ధ్యాలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్ సైన్సెస్) డాక్టర్ డీకే యాదవ మాట్లాడుతూ.. వరి పరిశోధనలకు ఐసీఏఆర్ మంచి ప్రోత్సాహాన్ని అందజేస్తుందన్నారు. వరిలో జీనోమ్ ఎడిటింగ్ వంటివి దేశంలో వరి పరిశోధనలకు ఊపు నిచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. దేశంలో హైబ్రీడ్ వరి సాగును విస్తరించాల్సిన సమయం ఇది అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..
For Telangana News And Telugu News