Share News

Dr Rajarao: ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ రాజారావు

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:05 AM

ఉస్మానియా వైద్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ రాజారావు నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జారీ చేశారు.

Dr Rajarao: ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ రాజారావు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా వైద్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ రాజారావు నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జారీ చేశారు. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని అందులో పేర్కొన్నారు. దీంతో డాక్టర్‌ రాజారావు వెంటనే బాధ్యతలు స్వీకరించారు.


గతంలో గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పని చేసిన డాక్టర్‌ రాజారావు.. గత ఏడాది ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో.. అడిషనల్‌ డీఎంఈ హోదాలో యాదాద్రి భువనగిరి బోధనాస్పత్రి సూపరింటెండెంట్‌గా వెళ్లారు. కరోనా సమయంలో గాంధీ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించడంలో సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ రాజరావు కీలక పాత్ర పోషించారు.

Updated Date - Apr 26 , 2025 | 04:05 AM