Dr Narendra Kumar award: డీఎంఈ నరేంద్రకుమార్‌కు ప్రతిష్ఠాత్మక ఓరేషన్ అవార్డు
ABN , Publish Date - Jul 20 , 2025 | 04:14 AM
పిడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ విభాగంలో చేసిన విశేష కృషికి తెలంగాణ వైద్య విద్య సంచాలకులు డాక్టర్

చిన్నారుల థొరాసిస్ సర్జరీ సేవలకు గుర్తింపు
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర అభినందనలు
హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): పిడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ విభాగంలో చేసిన విశేష కృషికి తెలంగాణ వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఏ.నరేంద్ర కుమార్‌ను జాతీయ అవార్డు వరించింది. చిన్న పిల్లలకు వైద్య సేవలు, ముఖ్యంగా సర్జరీల్లో అందించిన సేవలకు ఇండియన్ పిడియాట్రిక్ అసోసియేషన్ ప్రతిష్టాత్మక ‘ఓరేషన్’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పిడియాట్రిక్స్ సర్జన్ (ఐఏపీఎస్)లో భాగమైన ది సొసైటీ ఆఫ్ పిడియాట్రిక్ థొరాసిస్ సర్జరీ (ఎస్‌పీటీఎస్), మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్ చాప్టర్ ఆఫ్ పిడియాట్రిక్ సర్జన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండోర్‌లో తొలిసారి జరిగిన ఎస్‌పీటీఎస్-2025 జాతీయ సదస్సుకు దేశవ్యాప్తంగా 150 మంది సీనియర్ పిడియాట్రిక్ సర్జన్లు హాజరయ్యారు. ఈ సదస్సులో డాక్టర్ నరేంద్ర కుమార్‌కు ఓరేషన్ అవార్డు ప్రదానం చేశారు. ఓరేషన్ అవార్డు అందుకున్న నరేంద్ర కుమార్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. దేశంలో పిడియాట్రిక్ థొరాసిస్ సర్జరీ విభాగాన్ని ప్రారంభించిన నరేంద్ర కుమార్ కృషితో.. ఇందులో దేశవ్యాప్తంగా ఎంతో మంది నిపుణులుగా ఎదిగారని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పిడియాట్రిక్స్ కొనియాడింది. 25 ఏళ్లుగా అత్యంత స్వల్ప గాట్లతోనే ఎంతో మంది పిల్లలకు శస్త్రచికిత్స చేసి, వారి ప్రాణాలు కాపాడారని ప్రశంసించింది. పిడియాట్రిక్ థొరాసిస్ సర్జరీలో మంచి పేరు సంపాదించుకున్న డాక్టర్ నరేంద్ర కుమార్ 22 వ్యాసాలు ప్రచురించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News