Yadadri Bhuvanagiri: కొడుకుని కొట్టి చంపేశాడు
ABN , Publish Date - Feb 10 , 2025 | 05:13 AM
మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన తండ్రి.. పాఠశాల నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చావగొట్టాడు. భార్య వేడుకున్నా వినకుండా రెచ్చపోయి చివరికి పిల్లాడి ఛాతీపై తన్నాడు.

మద్యం మత్తులో తండ్రి ఘాతుకం.. ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కుమారుడిపై దాడి
ఆ దెబ్బలకు మరణించిన బాలుడు
బాలుడి తల్లి ఫిర్యాదు.. తండ్రి పరారీ
భువనగిరి జిల్లా ఆరెగూడెంలో ఘటన
చౌటుప్పల్ రూరల్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన తండ్రి.. పాఠశాల నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చావగొట్టాడు. భార్య వేడుకున్నా వినకుండా రెచ్చపోయి చివరికి పిల్లాడి ఛాతీపై తన్నాడు. ఆ దెబ్బలకు ఆ బాలుడు ప్రాణం వదలగా.. కొడుకు అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించి చేతులు కడుక్కునేందుకు విశ్వప్రయత్నం చేశాడా తండ్రి..!! యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెంది న కట్ట సైదులు.. భార్య నాగమణి, ముగ్గురు కుమారులతో కలిసి చౌటుప్పల్‌లో నివాసముంటున్నాడు. సైదులు చిన్నకొడుకు భాను (14) చౌటుప్పల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు శనివారం నిర్వహించిన వీడ్కోలు(ఫేర్‌వెల్) వేడుకలో పాల్గొన్న భాను.. రాత్రి ఏడు గంటల తర్వాత ఇంటికి వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సైదులు.. ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చావని ప్రశ్నిస్తూ భాను ను చితకబాదాడు. ఆవేశంలో ఛాతీపై తన్నా డు. దీంతో భాను కుప్పకూలిపోయినా సైదు లు ఆగలేదు. కుమారుడిని కొట్టవద్దని భార్య వేడుకున్నా దాడి ఆపలేదు. భాను అపస్మారకస్థితిలోకి వెళ్లిపోగా.. కాస్త తేరుకున్న సైదులు...రాత్రి కొడుకుని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు భాను అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు.
సాధారణ మృతిగా చిత్రీకరించే యత్నం
కొడుకు చావుని సాధారణ మృతిగా చిత్రీకరించేందుకు సైదులు తీవ్ర ప్రయత్నమే చేశాడు. తన కొడుకు అనారోగ్యంతో కుప్పకూలాడని వైద్యులకు లిఖితపూర్వకంగా సమాచారమిచ్చి భాను మృతదేహాన్ని స్వగ్రామం ఆరెగూడేనికి తరలించాడు. భార్యను బెదిరించి.. కొడు కు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఆదివారం ఉదయం శ్మశానవాటికకు తరలించాడు. అయితే, గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అంత్యక్రియలను అడ్డుకుని భాను మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే, కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తీసుకెళ్లకుండా చేసేందుకు సైదులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగి విఫలయత్నం చేశాడు. అనంతరం సైదులు పరారయ్యాడు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులు భాను మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. సైదులు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..