DGP Jitender: సంస్కరణలతోనే మెరుగైన పోలీసింగ్: డీజీపీ
ABN , Publish Date - Feb 04 , 2025 | 05:23 AM
తగిన సంస్కరణలతోనే మెరుగైన పోలీసింగ్‌కు అవకాశం ఉంటుందని డీజీపీ జితేందర్ అన్నారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో ‘‘పోలీస్ సంస్కరణల ద్వారా మెరుగైన పోలీసింగ్’’ అనే అంశంపై డీజీపీ కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది.

హైదరాబాద్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): తగిన సంస్కరణలతోనే మెరుగైన పోలీసింగ్‌కు అవకాశం ఉంటుందని డీజీపీ జితేందర్ అన్నారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో ‘‘పోలీస్ సంస్కరణల ద్వారా మెరుగైన పోలీసింగ్’’ అనే అంశంపై డీజీపీ కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..పోలీ్‌సశాఖ పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పోలీసింగ్ మెరుగుపరచుకోవాలని, ఉన్నతాధికారులు పోలీ్‌సస్టేషన్లు, కార్యాలయాల్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తే కొంత మార్పు జరుగుతుందని చెప్పారు.
రాష్ట్ర పోలీస్ శాఖను ముందంజలో ఉంచేందుకు నూతన విధానాలను అవలంబిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని డీజీపీ తెలిపారు. బాధితులపట్ల సానుకూలంగా స్పందించడం, నైపుణ్యతతో దర్యాప్తు, కమ్యూనిటీ పోలీసింగ్, సిబ్బంది ప్రవర్తన వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అంతర్గత పోలీస్ సంస్కరణల ప్రాజెక్టు.. పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఉందని ఐపీఎఫ్ ఉపాధ్యక్షుడు ఈశ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ ేస్టషన్ల పరిధిలో ప్రజల అభిప్రాయాలు సేకరించి తగిన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. .