Saleshwaram Jathara: సలేశ్వరం జాతరకు కదిలిన జనం
ABN , Publish Date - Apr 12 , 2025 | 03:47 AM
చేతిలో ఊత కర్రలు.. దట్టమైన అటవీ మార్గం గుండా వడి వడి అడుగులు.. తనువెల్లా భక్తి పారవశ్యం.. మది నిండా లింగమయ్య నామ సమ్మరణతో సలేశ్వరం జాతరకు భక్తజనం బయలుదేరారు.

అచ్చంపేట, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) : చేతిలో ఊత కర్రలు.. దట్టమైన అటవీ మార్గం గుండా వడి వడి అడుగులు.. తనువెల్లా భక్తి పారవశ్యం.. మది నిండా లింగమయ్య నామ సమ్మరణతో సలేశ్వరం జాతరకు భక్తజనం బయలుదేరారు. నల్లమల అభయారణ్యంలో వెలసిన స్వామిని దర్శించుకునేందుకు కాలి నడకన కదిలారు. మరో అమర్‌నాథ్ సాహస యాత్రగా బాసిల్లుతున్న నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం సలేశ్వర క్షేత్రానికి మొదటి రోజు శుక్రవారం భక్తుల తాకిడి పెరిగింది. మోకాళ్ల కుర్వ నుంచి స్వామి సన్నిధి వరకు భక్తులు బారులు తీరుతున్నారు. ఈ సారి జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
స్వామి దర్శనం కోసం వచ్చేవారికి మంచి నీరు, వైద్య సదుపాయాలతో పాటు ఉచిత అన్నదానం, ఫలాలను అందజేస్తున్నారు. దైవ దర్శనానికి దాదాపు 2 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. యేటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. పౌర్ణమికి ఒక రోజు ముందు పౌర్ణమి మరుసటి రోజు భక్తులు వేలాదిగా తరలివచ్చి లింగస్వామిని దర్శించుకుంటారు.
ఇవి కూడా చదవండి:
అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..
షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..
దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు