Share News

AI and ML Seat Vacancy: కోర్‌ సీట్లు భర్తీ.. సీఎస్ఈలో సుస్తీ

ABN , Publish Date - Jul 20 , 2025 | 03:57 AM

ప్రస్తుతం సాగుతున్న ఎప్‌సెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీఎస్ఈలో దాదాపు 98శాతం సీట్లు భర్తీకాగా..

AI and ML Seat Vacancy: కోర్‌ సీట్లు భర్తీ.. సీఎస్ఈలో సుస్తీ

  • ఎలక్ర్టానిక్స్‌, సివిల్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌లో దాదాపు భర్తీ

  • సీఎస్ఈ ఐటీలో 80 శాతం.. ఏఐలో సగం సీట్లు ఖాళీ

  • ముగిసిన ఈసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌

ప్రస్తుతం సాగుతున్న ఎప్‌సెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీఎస్ఈలో దాదాపు 98శాతం సీట్లు భర్తీకాగా.. ఈసెట్‌ కౌన్సెలింగ్‌లో మాత్రం పూర్తిగా భిన్నమైన పరిస్థితి నెలకొంది. పాలిటెక్నిక్‌, డిప్లొమా పూర్తి చేసుకున్నవారు నేరుగా ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు ఉద్దేశించిన ఈసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ శనివారం ముగిసింది. ఎప్‌సెట్‌కు భిన్నంగా సీఎ్‌సఈలో సగం సీట్లు కూడా భర్తీ కాలేదు. సీఎ్‌సఈలో ఏఐ కోర్సుకు ప్రస్తుతం ఎప్‌సెట్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల్లో భారీ డిమాండ్‌ ఉండగా.. ఈసెట్‌ ద్వితీయ సంవత్సరం ప్రవేశాల్లో సీట్ల భర్తీ 20శాతం కూడా లేదు. సీఎ్‌సఈ ఏఐ-ఎంఎల్‌లో మొత్తం 1,937 సీట్లుండగా 1,346 సీట్లు భర్తీ కాగా 591 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో 69.49శాతమే భర్తీ అయ్యాయి. అలాగే సీఎ్‌సఈలో మొత్తం 4,050 సీట్లలో 3,175 (78.40%) భర్తీకాగా 875 మిగిలిపోయాయి. సీఎ్‌సఈ డేటాసైన్స్‌ 1,174 సీట్లకు కేవలం 774 (65.93%) భర్తీ కాగా 400 భర్తీకి నోచుకోలేదు. సీఎ్‌సఈ ఏఐలో 26 సీట్లు ఉండగా.. 13 భర్తీ కాగా 13 మిగిలిపోయాయి. సీఎ్‌సఈ ఐటీలో మొత్తం 41 సీట్లలో 8మాత్రమే భర్తీకాగా 33 మిగిలిపోయాయి.


అంటే ఎప్‌సెట్‌లో ఐటీ బ్రాంచ్‌లోని మొత్తం సీట్లలో 97.20 శాతం భర్తీకాగా.. ఈసెట్‌కు వచ్చే సరికి భర్తీ అయిన సీట్లు కేవలం 19.51 శాతం మాత్రమే. ఈ లెక్కన దాదాపు 81శాతం సీట్లు భర్తీ కాలేదు. సీఎ్‌సఈ, ఐటీలో రాష్ట్రవ్యాప్తంగా 168 కాలేజీల్లో మొత్తం 8,552 సీట్లుండగా.. 6,205 (72.56%) సీట్లు భర్తీకాగా 2,347 మిగిలిపోయాయి. సీఎ్‌సఈ, కోర్‌ కోర్సులు అన్ని కలిపి మొత్తం ఇంజనీరింగ్‌లో 12,618 సీట్లు ఉండగా.. 10,129 (80.27%) సీట్లు భర్తీకాగా, 2,489 సీట్లు మిగిలిపోయాయి. కోర్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల సీట్లు దాదాపు వందశాతం భర్తీ అయ్యాయి. ఎలక్ర్టానిక్స్‌ ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌లో మొత్తం 877 సీట్లుండగా అన్నీ భర్తీ అయ్యాయి. సివిల్‌ ఇంజనీరింగ్‌లో 574 సీట్లలో 563 (98.08%), ఈసీఈలో 1,712 సీట్లలో 1,674 (97.78%), మైనింగ్‌ ఇంజనీరింగ్‌లో 88 సీట్లలో 87 (98.86%), మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో 639 సీట్లలో 576 (90.14%) భర్తీ అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి కోర్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో భారీ వృద్ధి నమోదైందని ఈసెట్‌ కౌన్సెలింగ్‌ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈసెట్‌ బి-ఫార్మసీలోనూ రికార్డుస్థాయిలో సీట్లు మిగిలిపోయాయి. మొత్తం 1,287 సీట్లు ఉండగా 57 (4.43%) సీట్లు మాత్రమే భర్తీ అయి 1230 సీట్లు మిగిలిపోయాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 03:57 AM