Hyderabad: కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ హోర్డింగ్..
ABN , Publish Date - Jul 18 , 2025 | 08:34 AM
కాంగ్రెస్ పాలనలో ఏ టు జెడ్ వరకు అవినీతి జరుగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో ఆయన కుటుంబానికి, బంధువర్గానికే కాంట్రాక్ట్‌లు కేటాయిస్తూ, వాటిపై కమీషన్లు దండుకుంటున్నారని వెలిసిన హోర్డింగ్ కలకలం సృష్టించింది. అర్ధరాత్రి పూట వెలిసిన ఈ హోర్డింగ్ గురించి సమాచారం తెలిసిన వెంటనే అధికారులు రంగప్రవేశం చేసి, వాటిని తొలగించారు.

- వెంటనే తొలగించిన అధికారులు
హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో ఏ టు జెడ్ వరకు అవినీతి జరుగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) పాలనలో ఆయన కుటుంబానికి, బంధువర్గానికే కాంట్రాక్ట్‌లు కేటాయిస్తూ, వాటిపై కమీషన్లు దండుకుంటున్నారని వెలిసిన హోర్డింగ్ కలకలం సృష్టించింది. అర్ధరాత్రి పూట వెలిసిన ఈ హోర్డింగ్(Hoarding) గురించి సమాచారం తెలిసిన వెంటనే అధికారులు రంగప్రవేశం చేసి, వాటిని తొలగించారు.
సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్(Secunderabad Jubilee Bus Station) సమీపంలోని వాజ్‌పేయి పార్కు వద్ద హోర్డింగ్ వెలిసింది. గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి, వాటిని ఏర్పాటు చేసినట్టు సమాచారం. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్ వెంకటేశం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు..
బీఆర్‌ఎస్ నా దారిలోకి రావాల్సిందే..
Read Latest Telangana News and National News