Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ
ABN , Publish Date - Feb 06 , 2025 | 06:44 PM
తీన్మార్ మల్లన్నకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇటీవల పార్టీ వ్యతిరేక విధానాలు, నాయకత్వంపై చేసిన వ్యాఖ్యల కారణంగా జారీ అయ్యాయి.

తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తన అభిప్రాయాలను పలు సందర్భాల్లో వెల్లడించారు. ప్రభుత్వ కులగణన సర్వేపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీంతో పాటు కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలపై కూడా పలు రకాల వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాంటి వ్యాఖ్యలు పార్టీలో విభేదాలు తేవడంతోపాటు ఆందోళనలు కలిగిస్తాయని భావించి నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు మల్లన్నకు అధికారికంగా నోటీసులు జారీ చేయకముందే కాంగ్రెస్ పార్టీ నోటీసుల గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఏమైనా మీ సొంతమా, కాంగ్రెస్ పార్టీ బీసీలదంటూ వ్యాఖ్యానించారు. పార్టీ పేరుతో తనను బెదిరించాలని చూస్తే కుదరదని హెచ్చరించారు. ఈ క్రమంలో బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, ఈ అంశంపై ప్రశ్నించని ఎమ్మెల్యేల పని ప్రజలే చూసుకుంటారని మల్లన్న వ్యాఖ్యానించారు.
ఈ షోకాజ్ నోటీసుల్లో ఆయన పార్టీ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. తన చర్యలు పార్టీకి నష్టం కలిగించకూడదని వివరణ ఇవ్వాలని కోరింది. మల్లన్నకు ఇచ్చిన ఈ నోటీసులు, పార్టీ విధానాల అనుసరణ, వ్యక్తిగత అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నారు. ప్రభుత్వ కీలక విషయాలను పబ్లిక్‌గా మాట్లాడడం వంటి చర్యలను తప్పుగా ప్రస్తావించింది. ఈ క్రమంలో పార్టీ తక్షణం చర్య తీసుకొని, కార్యాచరణలపై సమీక్షను ప్రారంభించింది. మల్లన్న అయితే, తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో తప్పు లేదని అంటున్నారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: అది అసమగ్ర కులగణన
ఈవార్తను కూడా చదవండి: GHMC: ప్యారానగర్ డంపుయార్డ్ పనులు ప్రారంభం
ఈవార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్!
ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
For Telangana News And Telugu News