Share News

AV Ranganath: ఆక్రమణలు తొలగించండి.. లేదా కూల్చేస్తాం

ABN , Publish Date - Apr 22 , 2025 | 09:08 AM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణలు తొలగించండి.. లేదా కూల్చేస్తాం.. అంటూ హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ హెచ్చరించారు. ‘ప్రజావాణి’లో వచ్చిన ప్రతి పిర్యాదులపై విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

AV Ranganath: ఆక్రమణలు తొలగించండి.. లేదా కూల్చేస్తాం

- ప్రజావసర స్థలాల కబ్జాలను ఉపేక్షించం

- కమిషనర్‌ రంగనాథ్‌

- హైడ్రా ప్రజావాణిలో 52 ఫిర్యాదులు

హైదరాబాద్‌ సిటీ: రోడ్లపై ఆక్రమణలు ఉంటే స్వచ్ఛందంగా తొలగించాలని, లేనిపక్షంలో హైడ్రా కూల్చివేస్తుందని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Commissioner AV Ranganath) హెచ్చరించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు రోడ్లపై ఆటంకాలు లేకుండా చూస్తామన్నారు. సోమవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో జరిగిన ‘ప్రజావాణి’లో వివిధ ప్రాంతాల నుంచి 52 ఫిర్యాదులు వచ్చాయి. రోడ్లపై గోడలు, ఇతరత్రా నిర్మాణాలు చేపడుతుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంద కలుగుతోందని పలువురు కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను బై నెంబర్ల ద్వారా కొందరు కబ్జా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వాటిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్‌ సూచించారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచేందుకు బీజేపీ పక్కా వ్యూహం..


ఫిర్యాదుల్లో కొన్ని..

- దుండిగల్‌ మునిసిపాలిటీ బౌరంపేట గ్రామం సర్వే నెంబర్‌ 345లో స్థానిక మాజీ ప్రజాప్రతినిధి 25గుంటల ప్రభుత్వ స్థలంలో అతిథిగృహం నిర్మించారని, సర్వే నంబర్‌ 14లో కూడా 36 గుంటల ప్రభుత్వ స్థలానికి బై నెంబర్‌ వేసి ఆక్రమించుకున్నారని పలువురు యువకులు ఫిర్యాదు చేశారు.

- మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా బాలానగర్‌ ఫిరోజ్‌గూడలోని మాధవినగర్‌ పార్కు స్థలం కబ్జా చేశారు. కోర్టు ఆదేశాలనూ స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. 300 చదరపు గజాల పార్కు స్థలం స్వాధీనం చేసుకోవాలి.


city4.2.jpg

- రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని రాజేంద్రనగర్‌ శ్రీ వెంకటేశ్వర కాలనీకి 60 అడుగుల రహదారి ఉండగా ప్రహరీ నిర్మించారు. సర్వే నెంబర్‌ 20లో 23 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశారు.

- శామీర్‌పేట మండలం దేవరయాంజల్‌లో రహదారులపై నిర్మాణాలు చేపట్టారు.

- సరూర్‌నగర్‌ చెరువు సమీపంలో ఇంటి స్థలం ఉంది. దాని చుట్టూ ఇళ్లున్నా.. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందని మా స్థలంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదు. వెంటనే ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించండి.

- రావిర్యాల పెద్ద చెరువులో నీటి మట్టం పెరిగి తమ ఇళ్లు మునిగిపోతున్నాయని పలువురు రంగనాథ్‌ దృష్టికి తీసుకువచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Price Record: బంగారం లకారం

గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు

కేటీఆర్‌పై కేసులు కొట్టివేసిన హైకోర్టు

ACB: ఏసీబీ వలలో ఐదుగురు అధికారులు

నీట ఆటగాడు..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 22 , 2025 | 09:08 AM