Share News

Jagga Reddy Daughter Engagement: జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో సీఎం

ABN , Publish Date - Apr 24 , 2025 | 04:38 AM

జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డిలో జరిగిన వేడుకకు పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారు.

Jagga Reddy Daughter Engagement: జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో సీఎం

  • సంగారెడ్డిలో కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి

  • డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు దామోదర, కోమటిరెడ్డి, సురేఖ, ఉత్తమ్‌ కూడా..

  • అతిథులకు జగ్గారెడ్డి దంపతుల ఆత్మీయ స్వాగతం

సంగారెడ్డి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి, గుణచైతన్యరెడ్డిల వివాహ నిశ్చితార్థ వేడుక బుధవారం సంగారెడ్డిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. జపాన్‌ పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి హైదరాబాద్‌ వచ్చిన ఆయన, నేరుగా సంగారెడ్డిలోని రామ్‌నగర్‌ బస్తీకి వచ్చారు. రామ్‌మందిర్‌లో పూజలు చేసిన అనంతరం కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. నిశ్చితార్థ వేడుకకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ సురేశ్‌శెట్కార్‌, రాహుల్‌ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి జేజు, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వీహెచ్‌, కుసుమకుమార్‌, సంపత్‌కుమార్‌, వంశీచంద్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తమ కూతురు నిశ్చితార్థ వేడుకకు వచ్చిన అతిథులకు జగ్గారెడ్డి, ఆయన సతీమణి, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల స్వయంగా స్వాగతం పలికారు.


ఇవి కూడా చదవండి

PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్‌ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు

Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 24 , 2025 | 04:39 AM