Share News

Chinna Srisailam Yadav: అమెరికాలో బాత్రూంలు కడిగిన ఆ సన్నాసికి ఏం తెలుసు..

ABN , Publish Date - Nov 15 , 2025 | 08:24 AM

అమెరికాలో బాత్రూంలు కడిగి వచ్చినోనికి హైదరాబాద్‌లో రౌడీలకు, పహిల్వాన్లకు తేడా తెల్వదని నవీన్‌యాదవ్‌ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌ విమర్శించారు. కుమారుడి గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Chinna Srisailam Yadav: అమెరికాలో బాత్రూంలు కడిగిన ఆ సన్నాసికి ఏం తెలుసు..

- రౌడీలకు, పహిల్వాన్లకు తేడా తెల్వదు

- కుమారుడి గెలుపు అనంతరం చిన్న శ్రీశైలం యాదవ్‌

హైదరాబాద్‌ సిటీ: అమెరికాలో బాత్రూంలు కడిగి వచ్చినోనికి హైదరాబాద్‌(Hyderabad)లో రౌడీలకు, పహిల్వాన్లకు తేడా తెల్వదని నవీన్‌యాదవ్‌ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌(Naveen Yadav father is Chinna Srisailam Yadav) విమర్శించారు. కుమారుడి గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రచారం సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నవీన్‌ యాదవ్‌పైనా, తనపైనా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ కె.తారకరామారావు చేసిన ఆరోపణలపై చిన్న శ్రీశైలం యాదవ్‌ స్పందించారు.


city4.2.jpg

తాము 48 ఏళ్లుగా ప్రజల్లో ఉన్నామని, జూబ్లీహిల్స్‌(Jubilee Hills) నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని తెలిపారు. నవీన్‌ యాదవ్‌(Naveen Yadav) భవిష్యత్‌ కార్యాచరణ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమేనని, ముఖ్యంగా యువత గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితమే ఈ విజయమని భావోద్వేగానికి గురయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2025 | 10:42 AM