Share News

Secunderabad: ఇంగ్లండ్‌ వ్యక్తి.. ముత్తాత తాత సమాధి వెతికించి..

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:34 AM

తండ్రి మరణానంతరం ఆయన దగ్గరున్న పూర్వీకుల వివరాలను డిజిటలైజేషన్‌ చేస్తున్న క్రమంలో తన ముత్తాత తాత సికింద్రాబాద్‌లో చనిపోయినట్లు డికెన్స్‌ గుర్తించారు. ఆయన సమాధిని చూడాలన్న ఆసక్తితో జర్నలిస్టు రవిరెడ్డిని ఆన్‌లైన్‌లో సంప్రదించి..వివరాలన్నీ పంపారు.

Secunderabad: ఇంగ్లండ్‌ వ్యక్తి.. ముత్తాత తాత సమాధి వెతికించి..

  • 8 నెలలు ప్రయత్నాలు ఫలించి... తిరుమలగిరిలో కనిపించిన స్మారకం

  • సమాధి చూసేందుకు భార్యతో కలిసి రానున్న ఆ పరదేశి

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): నాలుగైదు తరాలకు చెందిన తమ పూర్వీకుల పేర్లు ఎంతమందికి గుర్తుంటాయి? మహా అయితే ముత్తాత పేరు చెప్పగలరేమో.. ఆయన తండ్రి, తాత పేరు చెప్పమనేసరికి ఏమో అనేవాళ్లే ఎక్కువ!! అలాంటిది.. ఎప్పుడో 120 ఏళ్ల క్రితం ముత్తాత తాత మృతిచెందితే.. ఆ వివరాలను పట్టుకొని సికింద్రాబాద్‌లో ఆయన సమాఽధిని వెతికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడో వ్యక్తి. అదీ ఇంగ్లండ్‌లో ఉంటూ! ఇక దుర్లభం అనుకున్న స్థితిలో ఆ సమాధి దొరకడం తో ఆయన ఆనందం అంతా ఇంతా కాదు. ఆ వ్యక్తి.. ఇంగ్లండ్‌ వాస్తవ్యుడు, మాజీ సైనికుడు 67ఏళ్ల చార్లెస్‌ డికెన్స్‌. ఈయన ముత్తాత తాత, లెఫ్టినెంట్‌ చార్లెస్‌ విల్సన్‌ పుట్టి పెరిగిందంతా ఇంగ్లండ్‌లోనే! ఆయన బ్రిటిష్‌ సైన్యంలో 1880లో చేరారు. 1885లో పదోన్నతిమీద సికింద్రాబాద్‌లో అడుగుపెట్టాడు. ఇక్కడే హ్యారియెట్‌ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.


వీరికి నలుగురు సంతానం. అయితే అనారోగ్యం బారినపడ్డ చార్లెస్‌ విల్సన్‌ 1906లో కన్నుమూశారు. ఆయన భౌతికకాయన్ని ఈ ప్రాంతంలోనే ఖననం చేశారు. తర్వాత విల్సన్‌ భార్య హ్యారియెట్‌ తన పిల్లలను తీసుకొని ఇంగ్లండ్‌ వెళ్లిపోయారు. డికెన్స్‌ తండ్రి, తాత కూడా బ్రిటిష్‌ ఆర్మీలో పనిచేశారు. తండ్రి మరణానంతరం ఆయన దగ్గరున్న పూర్వీకుల వివరాలను డిజిటలైజేషన్‌ చేస్తున్న క్రమంలో తన ముత్తాత తాత సికింద్రాబాద్‌లో చనిపోయినట్లు డికెన్స్‌ గుర్తించారు. ఆయన సమాధిని చూడాలన్న ఆసక్తితో జర్నలిస్టు రవిరెడ్డిని ఆన్‌లైన్‌లో సంప్రదించి..వివరాలన్నీ పంపారు. రవిరెడ్డి బృం దం 8నెలల పాటు శ్రమించి.. తిరుమలగిరి సెమిట్రి-12లో చార్లెస్‌ విల్సన్‌ సమాధిని కనిపెట్టింది. ఆ వివరాలను ఫొటో తీసి పంపగా.. డికెన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయా యి.ముత్తాత తాత సమాధిని చూసేందుకు భార్యతో కలిసి వచ్చే ఏడాది డికెన్స్‌ సికింద్రాబాద్‌కు రానున్నట్లు రవిరెడ్డి చెప్పారు.


ఇవి కూడా చదవండి

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Updated Date - Apr 29 , 2025 | 05:34 AM