Case Filed: సీఎంపై పోస్టులు చేసిన వ్యక్తికి రిమాండ్
ABN , Publish Date - Apr 19 , 2025 | 05:36 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అగౌరవపర్చే విధంగా ఫొటో ఎడిట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

మద్దూర్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అగౌరవపర్చే విధంగా ఫొటో ఎడిట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ సైదులు, ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామానికి చెందిన వెంకటేశ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోను ఎడిట్ చేసి గత నెల 17న సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశాడు.
ఇలా చేయడం వల్ల రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసి శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయని, అతనిపై చర్యలు తీసుకోవాలని మద్దూరు మండలం రెనివట్ల కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు యాసిన్ అదే రోజు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు వెంకటేశ్ పై కేసు నమోదు చేసిశుక్రవారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.