Share News

Case on Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:56 AM

బీఆర్ఎస్ నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. రాజేంద్ర నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Case on Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
MLA Padi Kaushik Reddy

హైదరాబాద్, జులై 26: బీఆర్ఎస్ నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. రాజేంద్ర నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి.. కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 356(2),353(B)352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Updated Date - Jul 26 , 2025 | 11:56 AM