Share News

Hyderabad: హైదరాబాద్‌కు వ్యాపారవేత్త అదానీ

ABN , Publish Date - Mar 10 , 2025 | 04:04 AM

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ హైదరాబాద్‌కు వచ్చారు. ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమానికి తన కుమారుడు కరణ్‌ అదానీతో కలిసి ఆయన హాజరయ్యారు.

Hyderabad: హైదరాబాద్‌కు వ్యాపారవేత్త అదానీ

  • ‘ప్రతిమ’ చైర్మన్‌ శ్రీనివాసరావు ఇంట్లో తేనీటి విందుకు హాజరు

హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ హైదరాబాద్‌కు వచ్చారు. ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమానికి తన కుమారుడు కరణ్‌ అదానీతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే అదానీని ప్రతిమ గ్రూప్‌ చైర్మన్‌ బోయినపల్లి శ్రీనివాసరావు (ప్రతిమ శ్రీనివాసరావు) ఆహ్వానించడంతో ఆయన ఇంటికెళ్లారు.. అక్కడ శ్రీనివాసరావు ఇచ్చిన తేనీటి విందును అదానీ స్వీకరించారు. అంతకుముందు ప్రతిమ శ్రీనివాసరావు కుమార్తెలు డాక్టర్లు హరిణి, హాసినీలు అదానీకి స్వాగతం పలికారు.

Updated Date - Mar 10 , 2025 | 04:04 AM