Share News

BRS: సందడిగా.. వడివడిగా.. ఎల్కతుర్తి బాటలో గులాబీ దళం

ABN , Publish Date - Apr 27 , 2025 | 07:55 AM

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద నిర్వహించే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ సర్వం సన్నద్ధమైంది. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలకు మిడిల్‌ పాయింట్‌గా ఉన్న ఎల్కతుర్తి వద్ద భారీ సభను నిర్వహిస్తున్నారు.

BRS: సందడిగా.. వడివడిగా.. ఎల్కతుర్తి బాటలో గులాబీ దళం

- నేడు బీఆర్‌ఎస్‌ రజతోత్సవ మహా సభ

- ఎడ్లబండ్లు, ప్రభబండ్లు, ర్యాలీలు, పాదయాత్రలతో తరలుతున్న శ్రేణులు

- స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, పార్టీజెండాలతో ఓరుగల్లు రోడ్లు గులాబీమయం

- విస్తృత ఏర్పాట్లు చేసిన బీఆర్‌ఎస్‌ నేతలు

- 1,213 ఎకరాల్లో సభ ప్రాంగణం, పార్కింగ్‌ ఏర్పాట్లు

- 1,100మంది పోలీసులతో బందోబస్తు

- (ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్)

‘గులాబీ’ పార్టీ పాతికేళ్ల పండుగకు ఓరుగల్లు ముస్తాబైంది. ఎల్కతుర్తి వేదికగా ఆదివారం జరిగే బీఆర్‌ఎస్‌ సభకు సర్వం సిద్ధమైంది. తమ అధినేత కేసీఆర్‌తో పాటు ముఖ్యనేతలంతా హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. పాదయాత్రలు, ఎడ్లబండ్లు, ప్రభ బండ్లు, వాహనాల ర్యాలీలతో సభా ప్రాంగణానికి పయనమవడంతో ఓరుగల్లు రోడ్లు గులాబీ మయమయ్యాయి. ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన శ్రేణుల రాకతో సర్వత్రా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే పలు ప్రధాన రహదారులు, కూడళ్లతో పాటు ఎల్కతుర్తి మండల కేంద్రం గులాబీ జెండాలు, తోరణాలు, నేతల కటౌట్లు, ఫ్లెక్సీలతో కళకళలాడుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: High Court: ఎస్సీ వర్గీకరణ చట్టం చెల్లదు


2005, 2010లో వరంగల్‌ కేంద్రంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలకు దీటుగా ఈ రజతోత్సవ సభను నిర్వహించేలా.. లక్షలాదిగా జనసమీకరణ చేసేందుకు గులాబీదళం కార్యాచరణ అమలు చేసింది. ఇక అసెంబ్లీ ఎన్నికలు సహా వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేలా సభను జయప్రదం చేయాలన్న సంకల్పంతో పార్టీ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 1,216 ఎకరాలను సిద్ధం చేయగా.. 169ఎకరాల్లో సభప్రాంగణం, వెయ్యి ఎకరాల్లో పార్కింగ్‌, మిగతా స్థలాల్లో మరుగుదొడ్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించి.. పర్యవేక్షణకు సీసీ కెమెరాలు, 2వేల మంది వలంటీర్లను ఏర్పాటు చేసింది.


హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద నిర్వహించే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ సర్వం సన్నద్ధమైంది. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలకు మిడిల్‌ పాయింట్‌గా ఉన్న ఎల్కతుర్తి వద్ద భారీ సభను నిర్వహిస్తున్నారు. 50వేల వాహనాలకు పార్కింగ్‌ చేసే విధంగా, రైతుల నుంచి సేకరించిన 1,216 ఎకరాల్లో 1,059 ఎకరాలను పార్కింగ్‌ కోసం కేటాయించారు. వివిధ ప్రాంతాల నుంచే వచ్చే బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పార్కింగ్‌ పరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ఐదు జోన్లుగా విభజించారు. 2వేల మంది గులాబీ వలంటీర్లను నియమించారు.


brs1.2.jpg

అలాగే 154ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 500మంది కూర్చునే సామరఽ్థ్యంతో వేదికను నిర్మిస్తున్నా రు. వీఐపీల కోసం ప్రత్యేకంగా సభావేదిక వెనుక వైపు పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేశారు. అలాగే లక్షకు పైగా కుర్చీలను వేస్తున్నారు. భారీ సైజులో ఉన్న 23 ఎల్‌ఈడీ స్క్రీన్‌లను సభా ప్రాంగణంలో ఎక్కడ కూర్చున్న కనిపించేలా ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌ కోసం 200 జనరేటర్లను సమకూర్చుకున్నారు. మహిళలు, పరుషులకు వేర్వేరుగా 1,200కు పైగా తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మించారు.


వీటితో పాటు 12 వైద్యశిబిరాలను, ఆరు అంబులెన్స్‌లు, వాహనాలకు ట్రాఫిక్‌లో చెడిపోతే పక్కకు తీసుకెళ్లేందుకు 25టోయింగ్‌ వాహనాలను అందుబాటులో ఉంచారు. సభకు వచ్చేవారి కోసం 10లక్షల వాటర్‌ బాటిళ్లు, 15లక్షల మజ్జిగ బాటిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. 200మొబైల్‌ పెట్రోలింగ్‌ వాహనాలు, 200సీసీ కెమెరాలు, 200 వైర్‌లెస్‌ సెట్లతో నిరంతరం పర్యవేక్షించేలా గులాబీ నేతలు ఏర్పాట్లు చేశారు. దారిపొడువునా భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు, వాల్‌రైటింగ్‌తో గులాబీమయం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

లిక్కర్‌ దందాల కవితకు రాహుల్‌ పేరెత్తే అర్హత లేదు

పొన్నం చొరవతో స్వస్థలానికి గల్ఫ్‌ బాధితుడు

జాతీయ మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా డీకే అరుణ

యువతితో షాకింగ్ డాన్స్..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 27 , 2025 | 07:55 AM