Share News

Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మాగంటి సునీత, అక్షరపై కేసు నమోదు

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:48 PM

బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదయింది. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారనే నెపంతో సునీతను ఏ1గా, అక్షరను ఏ2గా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లోని వెంకటగిరిలో శుక్రవారం రోజు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల క్యాంపెయినింగ్‌లో భాగంగా వీరు నిర్వహించిన ప్రచారంపై కేసు నమోదయింది.

Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మాగంటి సునీత, అక్షరపై కేసు నమోదు
Maganti Sunitha

హైదరాబాద్, అక్టోబర్ 14: దివంగత జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదయింది. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారనే నెపంతో సునీతను ఏ1గా, అక్షరను ఏ2గా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లోని వెంకటగిరిలో శుక్రవారం రోజు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల క్యాంపెయినింగ్‌లో భాగంగా వీరు నిర్వహించిన ప్రచారంపై కేసు నమోదయింది. వెంకటగిరిలో నమాజ్ చేయడానికి వెళ్తున్న వారిని ఓటు వేయడానికి ప్రభావితం చేస్తున్నారని కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి:

PJR's daughter Vijaya Reddy: కాంగ్రెస్‌ను గెలిపించడమే పీజేఆర్‌కి ఇచ్చే నివాళి: విజయారెడ్డి

Mallojula Venugopal Rao: మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు

Updated Date - Oct 14 , 2025 | 12:50 PM