Share News

BJP: రాజాసింగ్‌పై బీజేపీ సీరియస్‌!

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:04 AM

పార్టీ రాష్ట్ర ముఖ్యులపై ఆరోపణలు గుప్పిస్తూ, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను కోరేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

BJP: రాజాసింగ్‌పై బీజేపీ సీరియస్‌!

  • ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు కోసం స్పీకర్‌కు లేఖ రాసేందుకు సిద్ధం

హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): పార్టీ రాష్ట్ర ముఖ్యులపై ఆరోపణలు గుప్పిస్తూ, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను కోరేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రత్యేకంగా లేఖ రాయనున్నట్టు సమాచారం. గతంలో పలుమార్లు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన సందర్భాల్లో రాజాసింగ్‌ను క్షమించినా, ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకోవాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు రాజాసింగ్‌కు నామినేషన్‌ పత్రం ఇచ్చినా.. ఆయన దాఖలు చేయకపోగా, పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆరోపణలు చేశారు. దీనిని జాతీయ నాయకత్వం సీరియ్‌సగా తీసుకుంది. ఆయన రాజీనామాను ఆమోదిస్తూనే ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరాలని నిర్ణయించింది’’ అని వెల్లడించాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు రాజాసింగ్‌ సన్నిహితంగా ఉంటారని, గతంలో రాజాసింగ్‌ను పార్టీ నాయకత్వం సస్పెండ్‌ చేస్తే ఎత్తి వేయించేందుకు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో సంజయ్‌ ప్రయత్నించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈసారి సంజయ్‌ చెప్పినా వినకుండా రాజాసింగ్‌ రాజీనామా చేశారని పేర్కొన్నాయి.


రేపు రాంచందర్‌రావు బాధ్యతల స్వీకరణ

బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్‌.రాంచందర్‌రావు శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు, సీనియర్‌ నేతలతో కలసి ఉదయం 9 గంటలకు గన్‌పార్కులోని అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని, 10 గంటలకు బాధ్యతలు చేపడతారు. తర్వాత చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.


ఇవి కూడా చదవండి

రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..

తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్

టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 04 , 2025 | 04:04 AM