Share News

BJP: 22న సికింద్రాబాద్‌లో బీజేపీ సంకల్ప సభ

ABN , Publish Date - Jun 20 , 2025 | 10:22 AM

సికింద్రాబాద్‌ సిక్‌ విలేజ్‌లోని ఇంటీరియల్‌ గార్డెన్‌లో ఈనెల 22న ఉదయం 10 గంటలకు బీజేపీ సంకల్ప సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బీజేపీ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌. మల్లారెడ్డి బీజేపీ నాయకులతో కలిసి గురువారం విడుదల చేశారు.

BJP: 22న సికింద్రాబాద్‌లో బీజేపీ సంకల్ప సభ

- బీజేపీ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు డా. మల్లారెడ్డి

- కార్యక్రమ పోస్టరు ఆవిష్కరణ

హైదరాబాద్: సికింద్రాబాద్‌ సిక్‌ విలేజ్‌లోని ఇంటీరియల్‌ గార్డెన్‌లో ఈనెల 22న ఉదయం 10 గంటలకు బీజేపీ(BJP) సంకల్ప సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బీజేపీ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌. మల్లారెడ్డి బీజేపీ నాయకులతో కలిసి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ..


city6.jpg

కేంద్రంలో నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajgiri MP Etala Rajender) ఆధ్వర్యంలో ఈనెల 22న వికసిత్‌ భారత్‌ సంకల్ప సభ, ఎగ్జిబిషన్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ మున్సిపల్‌ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుండిగల్‌ విఘ్నేశ్వర్‌, రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడు శ్యామ్‌రావు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

పాడు బుద్ధి.. పోయే కాలం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 20 , 2025 | 10:22 AM