Share News

BJP RamChander Rao: రేవంత్‌ను గద్దె దించి బీసీ వ్యక్తిని సీఎం చేయాలి

ABN , Publish Date - Jul 19 , 2025 | 05:17 AM

కాంగ్రెస్‌ పార్టీకి బీసీలపై అంత ప్రేమ ఉంటే సీఎం రేవంత్‌ను గద్దె దించి బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.

BJP RamChander Rao: రేవంత్‌ను గద్దె దించి బీసీ వ్యక్తిని సీఎం చేయాలి

  • బీసీ రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉంది: రాంచందర్‌రావు

  • కుల గణన ప్రకారం రేవంత్‌ క్యాబినెట్‌లో

  • మంది బీసీలు ఉండాలి: రఘునందన్‌రావు

మెదక్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీకి బీసీలపై అంత ప్రేమ ఉంటే సీఎం రేవంత్‌ను గద్దె దించి బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన మెదక్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మెదక్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమ్మేళనంలో ప్రసంగించారు. కేంద్ర క్యాబినెట్‌లో 23 మంది బీసీ మంత్రులు ఉన్నారని చెప్పారు. బీసీలకు 42ు రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన గాలికొదిలేసి ఢిల్లీకి చెక్కర్లు కొడుతున్నారని విమర్శించారు.


ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు. ఎంపీ రఘునందన్‌ రావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌ నుంచి వివిధ పార్టీల నేతలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. కుల గణన ప్రకారం రేవంత్‌ క్యాబినెట్‌లో ఎనిమిది మంది బీసీలకు స్థానం కల్పించాలని డిమాండ్‌ చేశారు. మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదన్న రాజ్యాంగాన్ని తాము గౌరవిస్తామని ఆయన చెప్పారు.


ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 05:17 AM