Hyderabad: హైదరాబాద్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ వర్సెస్ ఎంఐఎం
ABN , Publish Date - Apr 08 , 2025 | 03:52 AM
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ, ఎంఐఎం ముఖాముఖీ పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నిక కోసం నలుగురు నామినేషన్లు దాఖలు చేయగా, ఇద్దరి నామినేషన్లు మాత్రమే చెల్లుబాటవుతాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి సోమవారం తెలిపారు.

ఇద్దరు స్వతంత్రుల నామినేషన్ల తిరస్కరణ
23న పోలింగ్
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ, ఎంఐఎం ముఖాముఖీ పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నిక కోసం నలుగురు నామినేషన్లు దాఖలు చేయగా, ఇద్దరి నామినేషన్లు మాత్రమే చెల్లుబాటవుతాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి సోమవారం తెలిపారు. బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ ఎన్ గౌతంరావు, ఎంఐఎం తరఫున మిర్జా రియాజ్ ఎల్ హసన్ ఎఫెండి పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన మరో ఇద్దరు స్వతంత్య్ర అభ్యర్థులు చలిక చంద్రశేఖర్, కంటె సాయన్న నామినేషన్లను పది మంది ఓటర్ల చొప్పున ప్రతిపాదించాలి.
సోమవారం ఉదయం వరకూ గడువు ఇచ్చినా చంద్రశేఖర్, సాయన్న ఆ వివరాలు తెలిపే ఫామ్-2ఈ సమర్పించక పోవడంతో వారి నామినేషన్లను ఆర్‌ఓ తిరస్కరించారు. ఈ నెల 23 ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలో 112 మంది ఓట్లలో ఎంఐఎంకు 49 ఓట్లు, బీజేపీకి 25, బీఆర్‌ఎ్‌సకు 24, కాంగ్రెస్ పార్టీకి 14 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు పదవీ కాలం మే ఒకటో తేదీతో ముగియనుండగా.. కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..
మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...
For More AP News and Telugu News