Share News

Bhatti Vikramarka: ప్రజలు కేంద్రంగా సంక్షేమం, అభివృద్ధి: భట్టి

ABN , Publish Date - Apr 27 , 2025 | 03:54 AM

తెలంగాణలో ప్రజలే కేంద్రంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని.. ప్రజలు కేంద్రంగానే పరిపాలన సాగి స్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. భారత్‌ సదస్సులో ఆయన మాట్లాడారు.

Bhatti Vikramarka: ప్రజలు కేంద్రంగా సంక్షేమం, అభివృద్ధి: భట్టి

తెలంగాణలో ప్రజలే కేంద్రంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని.. ప్రజలు కేంద్రంగానే పరిపాలన సాగి స్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. భారత్‌ సదస్సులో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పుకొనేందుకు భారత్‌ సదస్సు ఒక వేదిక మాత్రమే కాదని... అనేక విషయాలు నేర్చుకునేందుకు ఉపయోగపడిందని చెప్పారు.


అహింస, స్వాతంత్య్రం, శాంతి అంశాలను ఈ సదస్సు ద్వారా గ్రహించామని తెలిపారు. తాము ఇప్పటికే ఈ మూడింటిని కొనసాగిస్తున్నామని.. భవిష్యత్తులో తమ విధానాలు, పథకాలు, ఆలోచనల్లో వీటిని మరింత సమర్థవంతంగా పాటిస్తామని వివరించారు. ఇంత భారీ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని చెప్పారు.

Updated Date - Apr 27 , 2025 | 03:54 AM