BRS MLA Vs Congress Leader: కాంగ్రెస్ నేతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి
ABN , Publish Date - Aug 07 , 2025 | 08:17 PM
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే.. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి చేశారు.
ఆసిఫాబాద్, ఆగస్ట్ 07: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జంకాపూర్‌లో గురువారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, అధికార కాంగ్రెస్ పార్టీ నియోకవర్గ ఇన్‌ఛార్జి శ్యామ్ నాయక్ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒకానొక దశలో శ్యామ్ నాయక్ తనను అవమానించారంటూ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ క్రమంలో టేబులుపై ఉన్న వాటర్ బాటిళ్లతో ఆయనపై దాడికి దిగారు. అనంతరం ఎన్నికల సమయంలో పలు హామీలు ఇచ్చి.. అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్కటి అమలు చేయలేదంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, తులం బంగారం తదితర హామీలు ఆ జాబితాలో ఉన్నాయని చెప్పారు. ఇంతలో కాంగ్రెస్ పార్టీ నేత శ్యామ్ నాయక్ స్పందిస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక హామీ ఇచ్చి.. వాటిని విస్మరించిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా ఆసీఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీని ఆయన నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత శ్యామ్ నాయక్‌పై వాటర్ బాటిల్లు విసిరేయడంతో.. స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఈ వ్యవహారమంతా జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ఎదుటే జరగడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు
For More Telangana News And Telugu News