Share News

Adilabad: ప్రధాని చేతుల మీదుగా ఆదిలాబాద్‌ కలెక్టర్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:05 AM

జాతీయ సివిల్‌ సర్వీసెస్‌ డే సందర్భంగా ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అరుదైన అవార్డును అందుకున్నారు.

Adilabad: ప్రధాని చేతుల మీదుగా ఆదిలాబాద్‌ కలెక్టర్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు

  • ప్రత్యేకంగా అభినందించిన ప్రధాని మోదీ

  • సమష్టి కృషితోనే సాధ్యమైందన్న జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా

న్యూఢిల్లీ/ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): జాతీయ సివిల్‌ సర్వీసెస్‌ డే సందర్భంగా ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అరుదైన అవార్డును అందుకున్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ జిల్లా కలెక్టర్‌కు అవార్డును అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని నార్నూర్‌ మండల బ్లాక్‌ను ఆస్పిరేషనల్‌ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యం, పోషణ, వ్యవసాయం, సామాజికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి విభాగాల్లో కలెక్టర్‌ మెరుగైన ఫలితాలతో అభివృద్ధి పథంలో నిలిపారు. ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారం - 2024 కింద నార్నూర్‌ ఎంపికవడంలో కలెక్టర్‌ కీలక పాత్ర పోషించారు. నార్నూరులో వందశాతం టీబీ స్ర్కీనింగ్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 70 శాతం ల్యాబ్‌లు, గ్రామ పంచాయతీల్లో 74శాతం సీఎస్సీ సెంటర్లను అధికా రులు ఏర్పాటు చేశారు. పోషకాలు అందించే నోవా లడ్డూ తయారీతో పాటు సేంద్రియ పద్ధతిలో స్థిర ఆదాయం ఇచ్చే పంటలు సాగుచేసేలా 1200 మంది రైతులకు ప్రోత్సాహకం అందించారు.


నార్నూరులోని అన్ని అంగన్‌వాడీలు అత్యుత్తమ పనితీరును కనబ రిచాయి. గిరిజనాభివృద్ధి, సుస్థిర వ్యవసాయం, మహి ళా సాధికారత, డిజిటల్‌ పరిపాలన.. ఇలా అన్నింటా నార్నూర్‌ బ్లాక్‌ ఉత్తమంగా నిలిచి, ప్రతి ష్ఠాత్మకమైన పీఎం అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా 500 బ్లాక్‌లు పోటీ పడగా.. నార్నూర్‌ మొదటి ఐదు అత్యుత్తమ బ్లాక్‌ల జాబితా లో చోటు సంపాదించింది. నార్నూరుతో పాటు కరప్ప (కేరళ), గమరియా(జార్ఖండ్‌), గంగా నగర్‌(త్రిపుర), రామ (మధ్యప్రదేశ్‌) బ్లాకులు అవార్డులను దక్కించు కున్నాయి. ఉత్తమ పనితీరును కనబరిచిన జిల్లా కలెక్టర్‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించి, అరుదైన అవార్డుతో సత్కరించింది. జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారం, అధికార యంత్రాంగం కృషి ఫలితంగానే జిల్లాకు ఈ అవార్డు వచ్చిందని జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ సమష్టిగా కృషి చేయడం ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 22 , 2025 | 04:05 AM