Share News

ACB: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ కలెక్టర్‌ అరెస్ట్‌

ABN , Publish Date - Jul 11 , 2025 | 05:17 AM

ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ నిమ్జ్‌ (నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌, మాన్యుఫాక్చరింగ్‌ జోన్స్‌) స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ సతీష్‌, డ్రైవర్‌ దుర్గయ్య ఏసీబీకి పట్టుబడ్డారు.

ACB: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ కలెక్టర్‌ అరెస్ట్‌

  • ఏసీబీ వలలో నిమ్జ్‌ అధికారులు.. సేకరించిన భూమికి పరిహారం ఇచ్చేందుకు రైతు నుంచి రూ.5 లక్షల లంచం డిమాండ్‌

  • రూ.65 వేలు తీసుకుంటుండగా పట్టివేత

  • డిప్యూటీ కలెక్టర్‌, డిప్యూటీ తహసీల్దార్‌తోపాటు డ్రైవర్‌ అరెస్ట్‌

జహీరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ నిమ్జ్‌ (నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌, మాన్యుఫాక్చరింగ్‌ జోన్స్‌) స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ సతీష్‌, డ్రైవర్‌ దుర్గయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నిమ్జ్‌ కార్యాలయంలో బాధిత రైతు నుంచి గురువారం వారు డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెదక్‌ జిల్లా న్యాల్‌కల్‌ మండలం హుసెళ్లికి చెందిన రైతు భూమిని నిమ్జ్‌ కోసం సేకరించారు. ఇందుకు సంబంధించిన పరిహారం ఇప్పించేందుకు రూ.5లక్షలు ఇవ్వాలని నిమ్జ్‌ అధికారులు డిమాండ్‌ చేశారు. డ్రైవర్‌ దుర్గయ్య ఇందుకు మధ్యవర్తిత్వం వహించాడు. అయితే, తాను అంత ఇచ్చుకోలేనని, రూ.75 వేలు ఇస్తానని రైతు ఒప్పుకొన్నాడు.


ఈ భూమికి సంబంధించి పరిహారం గత నెల 6న రైతు ఖాతాలో జమ అయింది. ఆ తర్వాత నుంచీ అధికారులు తరచూ రైతుకు ఫోన్‌ చేసి, డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేశారు. దీంతో సదరు రైతు గత నెల 26న ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో గురువారం డ్రైవర్‌ దుర్గయ్యకు రైతు రూ.65వేలు అందించారు. ఆ డబ్బును కార్యాలయంలోకి తీసుకొచ్చిన దుర్గయ్య.. డిప్యూటీ కలెక్టర్‌కు రూ.50వేలు, డిప్యూటీ తహసీల్దార్‌కు రూ.15వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రూ.65 వేలు స్వాధీనం చేసుకుని, ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 05:17 AM