Pargi: 6 నెలల గర్భిణికి అబార్షన్.. ఆందోళన
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:59 AM
వికారాబాద్ జిల్లా పరిగిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆరు నెలల గర్భిణికి అబార్షన్ చేసిన ఉదంతం ఉద్రిక్తతకు దారితీసింది. తమకు తెలియకుండా అబార్షన్ చేశారని ఆమె అత్తమామలు, వారి తరపు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

తల్లిదండ్రులే అబార్షన్ చేయించారని అత్తింటివారి ఆరోపణ
పరిగిలోని విజేత ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులపై కేసు
పరిగి, జూలై 9(ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా పరిగిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆరు నెలల గర్భిణికి అబార్షన్ చేసిన ఉదంతం ఉద్రిక్తతకు దారితీసింది. తమకు తెలియకుండా అబార్షన్ చేశారని ఆమె అత్తమామలు, వారి తరపు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వారి ఫిర్యాదుతో ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరిగి మండలానికి చెందిన యువకుడికి, చౌడాపూర్ మండలం కొత్తపల్లితండాకు చెందిన యువతికి 14 నెలల క్రితం వివాహం జరిగింది. అతను వారం క్రితం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడు. అతని భార్య ఆరు నెలల గర్భిణి. మొదటి నుంచి ఆమె విజేత ఆస్పత్రిలోనే పరీక్షలు చేయించుకుంటోంది. ఒక్కసారిగా ఆమెకు నొప్పులు రావడంతో తల్లిదండ్రులు మంగళవారం ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు చేసిన డాక్టర్.. గర్భంలో కవలలు ఉన్నారని, వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అబార్షన్ చేయాలని సూచించినట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి అబార్షన్ చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే అబార్షన్ చేయించారని ఆమె అత్తమామలు, వారి తరఫు బంధువులు బుధవారం ఆందోళనకు దిగారు.
వారికి ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపి, ఆస్పత్రి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆస్పత్రిని సీజ్ చేసి, వైద్యులు, సిబ్బందిపై క్రిమినల్ కేసు పెట్టాలని ఎల్‌హెచ్‌పీఎ్‌స రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌నాయక్ డిమాండ్ చేశారు. పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు డాక్టర్‌ను, సిబ్బందిని స్టేషన్‌కు తరలించారు. అప్పటికే ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు, సిబ్బంది అక్కడికి చేరుకొని విజేత ఆస్పత్రి యాజమాన్యానికి మద్దతుగా నిలిచారు. అబార్షన్ ఉదంతంపై ఇన్‌చార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.ప్రవీణ్‌కుమార్, జిల్లా ఉప ఆరోగ్య అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ విజేత ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రి నిర్వహణకు అనుమతులు ఉన్నాయా, అర్హత గల డాక్టర్లు ఉన్నారా అనే విషయాలపై విచారణ జరిపారు. గురువారం డీఎంహెచ్‌వో, ఇతర అధికారులు మరోసారి విచారణకు రానున్నట్లు సమాచారం. ఈ ఆస్పత్రిపై నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేశారంటూ గర్భిణి అత్త ఫిర్యాదుతో విజేత ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు.
నేడు పీసీ ఘోష్ కమిషన్ ముందుకు హరీశ్
హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు సంబంధించి అదనపు సమాచారాన్ని అందించేందుకు మాజీమంత్రి హరీశ్‌రావు గురువారం పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. అదనపు వివరాలను అందించేందుకు కమిషన్‌ను సమయం కోరడంతో ఈమేరకు గురువారం ఉదయం 11 గంటలకు బీఆర్‌కే భవన్‌లో హాజరుకావాలని కమిషన్ తెలిపింది. దీంతో ఆయన మరోసారి విచారణ కమిషన్‌ను కలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి