Hero Ram Charan: హీరో రామ్‌చరణ్ ఇంట్లో చిలుక మాయం..
ABN , Publish Date - Feb 12 , 2025 | 09:02 AM
సినీ నటుడు రామ్ చరణ్(Ram Charan) ఇంట్లో పెంపుడు చిలుక(Parrot) కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని ఉపాసన ట్వీట్ చేయగా.. యానిమల్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వెతికి పట్టుకొని అప్పగించారు.

- వెతికి పట్టుకుని అప్పగించిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు
హైదరాబాద్: సినీ నటుడు రామ్ చరణ్(Ram Charan) ఇంట్లో పెంపుడు చిలుక(Parrot) కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని ఉపాసన ట్వీట్ చేయగా.. యానిమల్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వెతికి పట్టుకొని అప్పగించారు. రామ్‌చరణ్ కుటుంబం కుట్టి అనే ఆఫ్రికన్ గ్రే చిలకను పెంచుకుంటోంది. రెండు రోజుల క్రితం చిలుక తప్పిపోయిందని, కనిపిస్తే చెప్పండి అంటూ ఉపాసన(Upasana) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Illegal Sand Mining: ఇసుక రీచ్‌లు, స్టాక్‌యార్డుల్లో తనిఖీలు చెయ్యండి
ఆ పోస్ట్‌ను చూసిన యానిమల్ వారియర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు చిలుకను వెతికి పట్టుకుని రామ్‌చరణ్ దంపతులకు అప్పగించారు. చిలుకను ఇంటికి తీసుకురాగానే అది చరణ్ భుజంపై కూర్చుంది. తన పెట్‌ను తిరిగి అప్పగించిన యానిమల్ వారియర్స్ టీమ్‌కు ఉపాసన ధన్యవాదాలు తెలిపారు. చిలుకను ఎలా కనిపెట్టామనేది యానిమల్ వారియర్ టీమ్ వివరంగా సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేసింది.
ఈవార్తను కూడా చదవండి: Congress: మంత్రివర్గ విస్తరణపై కదలిక
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి
ఈవార్తను కూడా చదవండి: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి.. సంచలనం రేపుతున్న ఘటన..
Read Latest Telangana News and National News