Share News

Food Poisoning: కలుషితాహారం తిని 11 మంది బాలికలకు అస్వస్థత

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:04 AM

కలుషిత ఆహారం తిని 11 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డిలోని నాగల్‌గిద్ద మండలం మోర్గి మోడల్‌ స్కూల్‌లో జరిగింది.

Food Poisoning: కలుషితాహారం తిని 11 మంది బాలికలకు అస్వస్థత

  • సంగారెడ్డి జిల్లా మోర్గి మోడల్‌ స్కూల్‌లో ఘటన

నారాయణఖేడ్‌/నాగల్‌గిద్ద, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కలుషిత ఆహారం తిని 11 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డిలోని నాగల్‌గిద్ద మండలం మోర్గి మోడల్‌ స్కూల్‌లో జరిగింది. హాస్టల్‌లో ఉంటున్న దాదాపు 68 మంది బాలికలు ఆదివారం రాత్రి భోజనం చేశారు. అనంతరం వీరిలో కొంతమందికి కడుపునొప్పి వస్తుందంటూ.. వాంతులు చేసుకున్నారు. దీంతో రాత్రి 10 గంటల ప్రాంతంలో వారిని నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో ఉదయం వరకు కోలుకున్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఆర్డీవో అశోకచక్రవర్తి ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు.


సోమవారం వీరందరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. కాగా, కేసీఆర్‌ గుర్తులను చెరిపి వేయాలనే కుట్రతోనే.. రేవంత్‌రెడ్డి గురుకులాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. 48 గంటల్లోనే వరుసగా మోర్గి, నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి, జగిత్యాల మండలం లక్ష్మిపూర్‌ గురుకులం, భద్రాది కొత్తగూడెం జిల్లా గురుకుల కళాశాలలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు చోటు చేసుకుంటున్నా.. ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 05:04 AM