10th Results: రేపు లేదా ఎల్లుండి టెన్త్ ఫలితాలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 02:48 AM
ఈసారి పదో తరగతి ఫలితాల్లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్‌లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు.. ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్‌లు
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తవగా.. ఒకటి, రెండు రోజుల్లో ఫలితాలు ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 30 లేదా మే 1వ తేదీన ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ వార్షిక పరీక్షలు జరగ్గా.. 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈసారి మార్కుల మెమోలో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇంతవరకు మొత్తం మార్కుల ఆధారంగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఇస్తుండగా.. ఇప్పుడు సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్‌లు ఇవ్వనున్నారు.
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్