Yadadri: యాదాద్రి జిల్లాలో 1000 కోళ్ల మృతి
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:24 AM
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని కోళ్ల ఫాంలో శనివారం వెయ్యి బ్రాయిలర్ కోళ్లు మృతి చెందాయి. ఆకస్మికంగా కొళ్లు మృత్యువాతపడడంతో ఆందోళనకు గురైన రైతు పశువైద్యాధికారికి సమాచారం ఇచ్చాడు.

బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవన్న వైద్యులు
చౌటుప్పల్ రూరల్, ఫిబ్రవరి 15: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని కోళ్ల ఫాంలో శనివారం వెయ్యి బ్రాయిలర్ కోళ్లు మృతి చెందాయి. ఆకస్మికంగా కొళ్లు మృత్యువాతపడడంతో ఆందోళనకు గురైన రైతు పశువైద్యాధికారికి సమాచారం ఇచ్చాడు. పశువైద్యాధికారి ఫాంకు చేరుకుని కోళ్ల నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ల్యాబ్‌కు పంపించారు.
అయితే మృతి చెందిన కోళ్లలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించలేదని ఆయన ప్రాథమికంగా నిర్ధారించారు. మూడు రోజుల్లో ల్యాబ్ రిపోర్టు వస్తుందని, అప్పటి వరకు కోళ్ల విక్రయాలు నిలిపివేయాలని రైతును ఆదేశించారు. మృతి చెందిన కోళ్లను సమీపంలోని తన వ్యవసాయ భూమిలో రైతు పాతిపెట్టాడు.