Share News

YouTube Trending: యూట్యూబ్‌లో కీలక మార్పు.. ఇకపై ట్రెండింగ్ వీడియోలు బంద్..

ABN , Publish Date - Jul 11 , 2025 | 04:36 PM

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా మారుతోంది. ఇదే సమయంలో యూట్యూబ్ కూడా కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే త్వరలో యూట్యూబ్ ట్రెండింగ్ పేజీని తొలగించబోతున్నట్లు తెలిపింది.

YouTube Trending: యూట్యూబ్‌లో కీలక మార్పు.. ఇకపై ట్రెండింగ్ వీడియోలు బంద్..
YouTube Trending

టెక్ ప్రపంచంలో మారుతున్న కాలంతోపాటు యూట్యూబ్ ఎప్పటికప్పుడు అనేక మార్పులను చేస్తోంది. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో దాదాపు 10 ఏళ్లపాటు వైరల్ వీడియోలను ప్రదర్శించిన ట్రెండింగ్ (YouTube Trending) ఫీచర్‎ను త్వరలో తొలగించనున్నారు. యూట్యూబ్ ఈ నిర్ణయాన్ని ధృవీకరించింది. ట్రెండింగ్ పేజీతో పాటు ట్రెండింగ్ నౌ లిస్ట్ కూడా కొన్ని వారాల్లో తొలగిపోనుంది. 2015లో ఒకే పేజీలో ట్రెండింగ్ వీడియోలను చూపించే విధానాన్ని మొదటగా తీసుకొచ్చారు. తక్కువ సమయంలో వైరల్ అయిన వీడియోలు ట్రెండింగ్ పేజీలో కనిపించేవి.


యూజర్ల వీడియోల ఆధారంగా..

2015లో ట్రెండింగ్ పేజీని మొదట ప్రారంభించినప్పుడు ఏది ట్రెండింగ్‌లో ఉందనే ప్రశ్నకు సమాధానం దొరికేది. కానీ ప్రస్తుత ట్రెండ్‌ ప్రకారం అనేక మంది ఆ పేజీ వైపు వెళ్లడం తగ్గిపోయిందని యూట్యూబ్ చెప్పింది. యూజర్లు చూస్తున్న షార్ట్స్, వీడియోల ఆధారంగా అల్గారిథమ్ పలు రకాల వీడియోలను సిఫార్సు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ట్రెండింగ్ పేజీ అవసరం క్రమంగా తగ్గుతుందని వెల్లడించింది. ట్రెండింగ్ స్థానంలో యూజర్లకు వారికి సంబంధించిన సిఫార్సు వీడియోలు కనిపిస్తాయని స్పష్టం చేసింది.


మరో కొత్త ఫీచర్..

ఇదే సమయంలో యూట్యూబ్ చార్ట్స్ అనే విభాగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో మ్యూజిక్ ఛార్ట్స్, పాడ్‌కాస్ట్, ట్రైలర్ ఛార్ట్స్ కనిపిస్తాయి. అంటే ట్రెండ్ కంటెంట్ ఏంటో పాపులారిటీ ఆధారంగా యూట్యూబ్ ర్యాంకింగ్ చేస్తుంది. మ్యూజిక్ ప్రియులకు టాప్ 50, లేదా పాప్ ఛార్ట్స్ వంటి వాటిని సిఫారసు చేస్తుంది. అలాగే సినిమా ట్రైలర్‌లను కూడా చార్ట్స్‌లో ఉంచుతుంది. గేమింగ్ ప్రియుల కోసం గేమింగ్ ట్రెండింగ్ క్లిప్స్ కూడా ఎక్స్‌ప్లోర్ సెక్షన్‌లో కనిపిస్తాయి.


క్రియేటర్ల కోసం..

క్రియేటర్ల కోసం యూట్యూబ్ స్టూడియోలో AI ఇన్‌స్పిరేషన్ ఫీచర్ తీసుకొచ్చింది. ఇది కంటెంట్ క్రియేటర్ల కోసం అడ్వాన్స్‌ సౌకర్యాలను అందిస్తుంది. మీ పాత వీడియోలతోపాటు ఆయా విభాగాల వ్యూస్ ఎలా ఉన్నాయో చెబుతుంది. దీంతోపాటు హైప్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. ఇది మీ వీడియోలను బూస్ట్ చేయడానికి అనుమతిస్తుంది.


ఇవి కూడా చదవండి


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 06:37 PM