Tech Tips: ఒకే వాట్సాప్ అకౌంట్‌ను 2 మొబైల్స్‌లో వాడటం ఎలా? ఇవిగో ట్రిక్స్!
ABN , Publish Date - Jun 29 , 2025 | 02:18 PM
WhatsApp Tricks and Tips: ఇప్పటివరకూ ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఒక డివైజ్‌లో మాత్రమే వాడేందుకు మాత్రమే అవకాశం ఉండేది. ఇకపై అలా కాదు. ఒకే ఖాతాను వివిధ పరికరాల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకోసం ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు..

WhatsApp Multi-device Login Tricks: మీరు ఒకే వాట్సాప్ ఖాతాను రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించాలనుకుంటున్నారా ? అయితే ఇదేమంత కష్టం కాదు. వాట్సాప్ కొత్త మల్టీ-డివైస్ ఫీచర్ సహాయంతో మీరు ఈ పనిని సులభంగా చేయవచ్చు. రెండు మొబైల్ ఫోన్‌లలో ఒక వాట్సాప్ ఖాతాను ఎలా యాక్సెస్ చేయాలో దశలవారీగా ఇక్కడ తెలుసుకుందాం. గతంలో వాట్సాప్ ఒకేసారి ఒక పరికరంలో మాత్రమే లాగిన్ అవ్వడానికి మిమ్మల్ని అనుమతించింది. కానీ ఇప్పుడు మల్టిపుల్ డివైజెస్ లో ఒకే వాట్సాప్ ఖాతాను యాక్సెస్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది.
మల్టీ-డివైస్ ఫీచర్ వాడటం ఎలా?
ముందుగా మీరు మరో ఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. కానీ అందులో ఫోన్ నంబర్‌ను నమోదు చేయవద్దు.
తర్వాత 'Link as companion device' అనే ఆప్షన్ కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేయండి. స్క్రీన్‌పై QR కోడ్ కనిపిస్తుంది. మొదటి ఫోన్ నుండి QR కోడ్‌ను స్కాన్ చేసి WhatsApp తెరవండి.
సెట్టింగ్స్ లోకి వెళ్లి లింక్డ్ డివైసెస్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు రెండో ఫోన్‌లో కనిపించిన QR కోడ్‌ను స్కాన్ చేయండి.
దీని తర్వాత, మీ WhatsApp రెండు ఫోన్‌లలో పనిచేస్తుంది. మీ చాట్‌లు, మీడియా, మెసేజెస్ రెండు ఫోన్లలో కనిపిస్తాయి.
మీ ఫోన్‌లో 'Link as companion device' ఆప్షన్ కనిపించకపోతే మీరు WhatsApp వెబ్ నుండి సహాయం తీసుకోవచ్చు.
చాట్‌లు సురక్షితమేనా?
వాట్సాప్ ఈ మల్టీ-డివైస్ ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు మద్దతు ఇస్తుంది. దీని అర్థం మీ ఛాట్స్, మీడియా, కాల్‌లు ఒక పరికరంలో లేదా నాలుగు పరికరాల్లో పూర్తిగా ప్రైవేట్‌గా ఉంటాయి. పైన పేర్కొన్న ప్రక్రియ తర్వాత రెండు మొబైళ్లలో ఒక వాట్సాప్ ఖాతాను యాక్సెస్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్ అవసరం లేదు.
వాట్సాప్‌లో లాగ్ అవుట్ ఫీచర్
వాట్సాప్‌లో త్వరలో లాగ్ అవుట్ ఆప్షన్ (వాట్సాప్ లాగ్అవుట్) రాబోతోంది. దీని ప్రయోజనం ఏమిటంటే, మీరు వాట్సాప్ ఉపయోగించకూడదనుకుంటే లాగ్ అవుట్ కావచ్చు. ఇలా చేయడం ద్వారా వాట్సాప్ డేటాను సురక్షితంగా ఉంటుంది.
ప్రస్తుతం, వాట్సాప్‌లో లాగ్ అవుట్ ఆప్షన్ లేదు. ఒక యూజర్ ఇకపై వాట్సాప్ వద్దనుకుంటే దానిని తొలగించే ఆప్షన్ వారికి ఉంటుంది. అయితే, ఈ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు యూజర్ వారి మొత్తం వాట్సాప్ డేటాను కోల్పోతారు. లాగ్ అవుట్ ఆప్షన్ వాట్సాప్ వెబ్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ అది వారిని వెబ్ వెర్షన్ నుండి అంటే కంప్యూటర్ నుంచి మాత్రమే లాగ్ అవుట్ చేస్తుంది.
ఇవీ చదవండి:
గూగుల్ ఏఐ మోడ్ అంటే ఏంటి.. దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసా
అంతరిక్షంలోకి వెళ్లే ముందు.. శుభాంశు శుక్లా ఏం పాటలు విన్నారంటే
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి