ChatGPT: చాట్‌జీపీటీలో కొత్త మోడల్స్..వీరికి ఇవి బెస్ట్ ఛాయిస్
ABN , Publish Date - May 15 , 2025 | 07:42 PM
ఓపెన్ ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. తాజాగా అనేక కొత్త మోడల్స్ యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చాయి. అయితే యూజర్లకు ఉచితంగా అందుబాటులో ఉన్నవి ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.

ఓపెన్ ఏఐ నేతృత్వంలోని చాట్‌జీపీటీ నుంచి మరో కీలక ప్రకటన వచ్చేసింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న కొత్త మోడల్స్ GPT-4.1, GPT-4.1 Mini, ఇప్పటివరకు డెవలపర్లకే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు చాట్‌జీపీటిని వాడే Plus, Pro, Team ప్లాన్ ఉన్న యూజర్లకు కూడా ఇవి అందుబాటులోకి వచ్చేశాయి. ఈ క్రమంలో ప్రస్తుతం GPT-4.1 Mini ఉచిత యూజర్లు, పెయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది.
GPT-4.1 మోడల్ స్పెషల్ ఏంటి
GPT-4.1 ప్రత్యేకంగా కోడింగ్ టాస్క్స్, ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్ పనులలో మంచి పనితీరు ఇవ్వడానికి రూపొందించబడిన కొత్త మోడల్. ఈ మోడల్ గతంలో ఉన్న GPT-4o, GPT-4 Mini మోడల్స్ కంటే మరింత వేగంగా పనిచేస్తుంది. ఈ క్రమంలో సాధారణ కోడింగ్ అవసరాలకు ఇది చాలా మంచి ప్రత్యామ్నాయమని చెప్పవచ్చు. ఇప్పుడు మీకు కోడింగ్ గురించి ఏదైనా ఇబ్బందులు ఉంటే, GPT-4.1 మోడల్ ఎంచుకోవచ్చు. అంతేకాదు డెవలపర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, కోడ్ రైటింగ్ లేదా డీబగింగ్ సేవలు అందించే వారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
గత మోడల్స్ తొలగింపు
OpenAI ఇప్పటికే GPT-4.0, GPT-4o Mini మోడల్స్‌ను చాట్‌జీపీటీ నుంచి తొలగించింది. ఈ క్రమంలో GPT-4.1 మోడల్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.
GPT-4.1 ప్రయోజనాలు
వేగం, పనితీరు: GPT-4.1 చాలా వేగంగా పనిచేస్తుంది. మీరు కోడింగ్ పనులను చేసుకునేందుకు టైం ఆదా చేసుకోవచ్చు
కోడింగ్ టాస్క్స్ లో నైపుణ్యం: GPT-4.1 ప్రత్యేకంగా కోడింగ్, డీ బగింగ్, వివిధ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ పనులలో ఉత్తమ పనితీరును చూపిస్తుంది
ఫాలోయింగ్: ఈ మోడల్ సాధారణ GPT మోడల్స్ కంటే, ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్ విధానంలో మరింత నైపుణ్యం కలిగి ఉంటుంది. అంటే మీరు ఇచ్చే ఆదేశాలను మరింత సరిగ్గా, స్పష్టంగా అనుసరిస్తుంది.
GPT-4.1 Mini గురించి
GPT-4.1 Mini అనేది GPT-4.1 చిన్న వెర్షన్. ఇది ఫ్రీ యూజర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఇది GPT-4.1 కన్నా కొంచెం తక్కువ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. కానీ కోడింగ్ అవసరాలకు పూర్తి స్థాయిలో సరిపోతుంది. ఫ్రీ యూజర్లకు ఇది మంచి ఎంపికగా ఉంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. OpenAI ప్రస్తుతం సేఫ్టీ ఈ వాల్యూషన్ హబ్ అనే కొత్త ప్లాట్‌ఫారమ్ ప్రారంభించి, సమగ్ర సేఫ్టీ అంచనాలు ప్రచురించే ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
Also Read:
SJaishankar: కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదు
ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్..ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..
గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు
For More Andhra Pradesh News and Telugu News..